రేపు కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

29 Jan, 2017 20:46 IST|Sakshi
రేపు కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (సోమవారం) కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో బొమ్మలురు, కానుమెలులో కరువు ప్రాంతాల్లో పర్యటించనున్నారని వైఎస్ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో వెల్లడించారు. రెండేళ్లుగా పంటలు పండని పొలాలను, తెగులుతో నష్టపోయిన మినుము పంటలను పరిశీలించిన అనంతరం అక్కడి రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి కానున్నారు.

మరిన్ని వార్తలు