ప్రజాసంకల్పయాత్ర 189వ రోజు షెడ్యూలు

13 Jun, 2018 19:43 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూలు ఖరారైంది. జననేత వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్‌ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉచిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: బుధవారం ఉదయం 188వ రోజు ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. రైల్వే ష్టేషన్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర అడుశంభునగర్‌, లక్ష్మీనరసింహా నగర్‌ మీదుగా ధవళేశ్వరం చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకున్నారు. అనంతరం ధవళేశ్వరం, బొబ్బర్లంక, పేరవరం చేరుకున్నాక పాదయాత్ర ముగిసింది. జననేత వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ రోజు జననేత 12 కిలో మీటర్లు నడిచారు. వైఎస్‌ జగన్‌ ఇప్పటివరకు 2,329.1 కిలోమీటర్లు నడిచారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ అంటే ఒక నమ్మకం..

ఈ సంకల్పం.. అందరికోసం

‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ఉత్సాహం నింపిన సంకల్పం

సిక్కోలులో ‘తూర్పు’ సందడి

విజయోస్తు జగనన్న!

జన గర్జన