నేడు ముస్లింల ఆత్మీయ సదస్సు

12 Sep, 2018 07:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజ కవర్గ పరిధిలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో చినగదిలి వద్ద బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదçస్సు జరుగుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం చెప్పారు. ఈ సదస్సులోపెద్ద సంఖ్యలో ముస్లిం సామా జికవర్గానికి చెందిన పెద్దలు, ప్రముఖు లు, ప్రతినిధులు పాల్గొనాలని ఆయన కోరారు. చినగదిలి నుంచి ఆరిలోవకు వెళ్లే దారిలో క్యూ–1 ఆస్పత్రి పక్కన జరుగనున్న ఈ ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. 261వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం బీచ్‌రోడ్‌లోని లాసెన్స్‌బే కాలనీ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఉషోదయ జంక్షన్, టీటీడీ ఫంక్షన్‌ హాలు, ఎంవీపీ కాలనీ, ఎంవీపీ డబల్‌ రోడ్డు, వెంకోజీపాలెం పెట్రోల్‌ బంక్‌ జంక్షన్, హనుమంతవాక జంక్షన్, ఆరిలోవ జంక్షన్‌ మీదుగా చినగదిలి వరకు సాగుతుందన్నారు. చినగదిలిలో ఆత్మీయ సదస్సు అనంతరం అదే ప్రాంతంలో రాత్రి బస చేస్తారన్నారు. బుధవారం నాటి పాదయాత్రలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

297వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

నేటి ప్రజాసంకల్పయాత్ర ఇలా....

ఏడాదైనా వేతనం లేదు

అప్పు తీరలేదన్నా..

డీఎస్సీలో హిందీ పండిట్లకు అన్యాయం

అంత్యోదయ కార్డుతో ఆదుకోవాలి...

స్కాలర్‌షిప్పు మంజూరు చేయడం లేదు...

వ్యాయామ టీచర్ల పోస్టులు తీయడం లేదన్నా..

పుష్కర కాలంగా పని చేస్తున్నా...

జనహృదయ విజేత

296వ రోజు పాదయాత్ర డైరీ

నువ్‌ జాగర్త నాయనా..

297వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

వైఎస్సార్‌ సీపీలో చేరిన రామచంద్రయ్య