ఇంతలో ఎన్నెన్ని వింతలో..

30 May, 2020 09:49 IST|Sakshi

జనంతో మమేకమై వారి కష్టాలను దగ్గరగా చూసినవాడు నేను విన్నాను.. నేను ఉన్నాను అని ధైర్యం చెప్పినవాడు. ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలో 90 శాతం పనులు చేసి చూపెట్టాడు. అడిగినవే కాక అడగనివీ.. చెప్పినవే కాక చెప్పనివీ అమలు చేస్తున్నాడు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాడు. అన్నదాత గుండె చప్పుడు విన్నాడు.. ‘భరోసా’ కల్పించాడు. సామాన్యులకు సైతం అత్యున్నత విద్య, వైద్యం అందాలని తపించాడు. అందుకు అరుదైన పథకాలెన్నో ప్రవేశపెట్టిన ఒకే ఒక్కడు 

నాలుగేళ్లు దోచుకొని ఆఖరి సంవత్సరం వరాలు కురిపించే కాలంలో.. తొలి ఏడాదే స్వర్గం చూపించాడు.. ఇంకా ఏం కావాలో చెప్పమంటున్నాడు. మన పాలనపై మీ సూచన చేస్తే భవిష్యత్తు బంగారం చేస్తానంటున్నాడు. ప్రజల సమక్షంలో తన పనితీరును తానే సమీక్షించుకోవాలంటే  ఎంతటి ధీశక్తి ఉండాలి.. ఎంతటి అంకితభావం కావాలి.. మాట తప్పని మడమ తిప్పని నైజం ఉంటేనే అది సాధ్యం. అందుకే మదిమదిలో ఆ ప్రియతమ నేతకు నీరాజనం  

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రైతు రారాజును చేయాలి... సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమిది. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ లక్ష్యం దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. పంటచేతికి వస్తే ఎలా అమ్ముకోవాలనే చింత లే కుండా నేరుగా రైతు వద్దకే కొనుగోలుదారులు వెళ్లి మద్దతు ధర చెల్లించి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అకాల వర్షాలు వచ్చి పంటనష్టపొతే దాని నుంచి ఉపశమనం పొందేందుకు విపత్తు నిధి ఏర్పాటు చేశారు. ఎరువుల నుంచి కొనుగోలు వరకు అన్నీ సదుపాయాలు అందేలా రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. గత ఏడాది 2019–20లలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 2.5లక్షల హెక్టార్లు. ఆ సీజన్‌కుగాను జిల్లాలో 1.21లక్షల రైతులకు గాను విత్తనాలు 67,248 క్వింటాళ్లు పంపిణీ చేశారు. సబ్సిడీ విలువ రూ.9.07కోట్లుగా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 2020–2021కి గాను ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 2.13లక్షల హెక్టార్లలో వరి సాగుకి సిద్ధం చేశారు. దీనికి 79200 క్వింటాళ్ల విత్తనాలను గ్రామ సచివాలయాల పరిధిలో అందుబాటులో ఉంచారు. దీనికి క్వింటాకు రూ.1000 సబ్సిడీగా అందించారు.  (చరిత్ర గతిని మార్చి నవశకాన్ని లిఖించి..)

ఆనందాల తీరం 
వజ్రపుకొత్తూరు: జిల్లా తీరం ఇక సిరులమయం కానుంది. ముఖ్యమంత్రి జగన్‌ ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రానికి రూ.11.95 కోట్లు వెచ్చించి శంకుస్థాపన చేయగా ఇటీవల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలేంలో రూ.332.9 కోట్లతో మినీ ఫిషింగ్‌ హిర్బర్‌కు నిధులు కేటాయించారు. దీంతో జిల్లా మత్స్యకారుల్లో ఆనందం రెట్టిస్తోంది. ఈ రెండు నిర్మాణాలు పూర్తయితే జిల్లాలో మత్స్యకారులు ఇక వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు–మంచినీళ్లపేట మధ్య 13 ఎకరాల్లో ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రం ఏర్పాటుకు ఇటీవల భూమి పూజ సైతం చేపట్టారు. పలాస ఎమ్మె ల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు సొంత మండలం కావడం ఆయన మత్స్యకార సామాజిక వర్గం చెందిన వ్యక్తి కావడంతో ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి పరిపాలనా అనుమతులు సాధించారు. (విశాఖపై రాజముద్ర..)

దీంతో మంచినీళ్లపేట వద్ద మండలానికి చెందిన 5వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరనుంది. భవిష్యత్‌లో ఇది ఫిషింగ్‌ హార్బర్‌గా కూడా కార్యరూపం దాల్చేందుకు ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. పారాదీప్‌ నుంచి విశాఖ వరకు ఎక్కడా హార్బర్‌ సదుపాయం లేదు. ఆ సమస్య కూడా తీరనుంది. ఎచ్చెర్ల మండగలం బుడగట్లపాలేం వద్ద 37.50 ఎకరాల్లో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల రూ.332.9 కోట్లు కేటాయించింది. మరో పక్కకవిటి మండలం ఇద్దివానిపాలేం, సోంపేట మండలం బారువ కొత్తూరు, కవిటి మండలం ఇద్దివానిపాలేం, ఎచ్చెర్ల మండలం రొళ్లపేట వద్ద సై తం మినీ జెట్టీలు నిర్మించేందుకు ప్రతిపాదనలు, సర్వేలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలు కార్యరూపం దాల్చితే మ త్స్యకారుల బతుకులకు భరోసా దొరికినట్టే. బుడగట్లపాలేంలో అత్యాధునిక కోల్ట్‌ స్టోరేజీ, ఇస్‌ ప్లాంట్‌తో పాటు బెర్తింగ్‌ సౌకర్యం, డీప్‌ ఫిషింగ్‌ చేపట్టేందుకు అనువుగా తీర్చిదిద్దుతామని మత్స్యశాఖ అధికారులు శ్రీనివాసరావు, సత్యన్నారాయణలు చెప్పారు.  

ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం  
ఫిష్‌ల్యాండింగ్‌ కేంద్రం నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. జెట్టీ అవసరాన్ని, మత్స్యకారుల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విజయం సాధించాం. జగన్‌కు మత్స్యకారులంటే అమితమైన ప్రేమా భిమానాలు ఉన్నాయి. దశలవారీగా ఫిష్‌ల్యాండింగ్‌ కేంద్రంను హార్బర్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన హామీ ఇచ్చారు.  
 డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే, పలాస నియోజకవర్గం 
 
గతంలో చూడలేదు 
గతంలో ఎన్నడూ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. మత్స్యకారుల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తెచ్చారు. ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రం మాకు వరం వంటిది. అటు ఒంకులూరు తీరం నుంచి ఇటు భావనపాడు వరకు 
ఎంతో మంది మత్స్యకారులకు ఇది అనుకూలం. ఇక నుంచి ఇసుక దిబ్బలపై చేపలను ఆరబెట్టుకునే దుస్థితి ఉండదు. వర్షం వస్తే ఆరబెట్టే చేపలు తడిసి పోతాయన్న భయం ఉండదు. నిధులు మంజూరు చేసి సీఎం జగన్, ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజులకు రుణపడి ఉంటాం.  
– జి.రామయ్య, మత్స్యకారుడు మంచినీళ్లపేట 

వ్యవసాయం: రైతు భరోసా.. పీఎం కిసాన్‌ సాయం 
జిల్లాలో 2019–20లలో రైతుభరోసా, పీఎం కిసాన్‌ పథకం కింద 3.34 లక్షల మందికి గాను మొత్తం రూ 450.98 కోట్లు రైతుల ఖాతాలో జమచేశారు. 2020–2021 కింద మొదటి విడతగా 3.64లక్షల మంది రైతులకుగాను రూ 272.94కోట్లు జమ చేశారు. ఈ పథకానికి భూ యజమానులు, కౌలురైతులు, గిరిజన రైతులు వంటి వారందరికి క్రాప్‌ కల్టివేషన్‌ సరి్టఫికెట్‌ ఉన్నవారందరికీ ఈ పథకం వర్తించేలా ప్రణాళిక వేశారు.  

వైఎస్సార్‌ ఉచిత బీమా  
జిల్లాలో 2019–20లో ఈ పథకం కింద రుణాలు తీసుకున్న, తీసుకోని రైతులకు మొత్తం 4.10 లక్షల మందికి గాను రూ.1323.65కోట్లు పంటల బీమా కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాయి. 

సచివాలయ ఉద్యోగాలు 
వ్యవసాయశాఖలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు (విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్స్‌) మొత్తం 676 ఉద్యోగాలు అందించారు.  

ఆర్‌బీకేలు ప్రారంభం 
రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సలహాలు సూచనలు వంటి అన్ని రకాల సేవలను రైతుభరోసా కేంద్రాల నుంచి అందించేందుకు గాను యుద్ధ ప్రాతిపదికన ఈ నెల 30న మొదటి విడతగా 820 రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించేందుకు సిద్ధం చేశారు.  

వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్స్‌ 
జిల్లాలో నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున మొత్తం 9 అగ్రిల్యాబ్స్‌ను, ఒక్కటి కేంద్ర అగ్రిల్యాబ్‌ కింద జిల్లా కేంద్రం అంపోలులో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లలో విత్తనాలు, ఎరువుల నాణ్యతను, భూసార ప రీక్షలు చేసేందుకుగాను నాణ్యత పరీక్షలు చేస్తారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తి చేసి రోడ్లు, భవనాల శాఖలో ఇంజినీరింగ్‌ విభాగానికి నిర్మాణ పనులు అప్పగించినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.  

సముద్రమంత ప్రేమ
అరసవల్లి: గంగపుత్రుల బెంగను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అర్థం చేసుకున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి మత్స్యకారులపై సముద్రమంత ప్రేమను చూపిస్తున్నారు. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు మత్స్య సంపద ఉత్పత్తి కోసం వేట నిషేధ సమయంగా ప్ర భుత్వం అమలు చేస్తోంది. అయితే ఈ విరామ సమయంలో మత్స్యకారులకు విరామ భృతి కింద ఏకంగా రూ.10 వేలు వారి అకౌంట్స్‌లో ఈనెల 6వ తేదీనే జమ చేసింది జగన్‌ ప్రభుత్వం. ఇదే సమయంలో గత ప్రభుత్వం కేవలం రూ.4 వేలు మాత్రమే ఇచ్చేది. అది కూడా రెండేళ్లకో మూడేళ్లకో ఇచ్చే పరిస్థితులుండేవి. వీటిని పూర్తిగా మార్చేస్తూ వేట విరామ సమయంలోనే ఆ మొత్తాన్ని జమ అయ్యేలా చేసి గంగ పుత్రుల ఆకలి తీర్చారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారి సొంత అకౌంట్స్‌లో రూ. 10 వేలు జమ చేశారు. జిల్లాలో ఈ మేరకు 14289 మంది మత్స్యకారులను గుర్తించి వీరి కోసం రూ.14.28 కోట్ల నిధులను కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 9 జిల్లాలకు చెందిన 1.12 లక్షల మంది మత్స్యకారులకు ఈ రకంగా భృతి అందజేశారు.  

శాశ్వత ఉపాధి కోసం హార్బర్లు  
దేశంలో అన్ని ప్రాంతాల కంటే మన జిల్లా నుంచే అధిక శాతం మంది మత్స్యకారులు వలసలు వెళ్తూ ఉపాధి పొందుతున్నారు. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో జిల్లాకు చెందిన వేలాది మంది మత్స్యకారులు ఉన్నారు. కరోనా పరిస్థితుల్లో వీరావల్, మంగళూర్, చెన్నై నుంచి సుమారు 6 వేల మంది మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చి క్వారంటైన్‌లో పెట్టింది. ఈ పరిస్థితులను చూసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా పరిగణించి ఇక మీదట జిల్లా నుంచి వలసలు వెళ్లకుండా ఉండేందుకు జిల్లాలోనే పలు చోట్ల ఫిషింగ్‌ హార్బర్లు, జెట్టీల ని ర్మాణానికి చర్యలు చేపట్టారు. అలాగే ఫిషింగ్‌ హార్బర్లు, పోర్టుల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. జిల్లాలో భావనపాడులో పోర్టు నిర్మాణానికి అడ్డంకులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేటలో జెట్టీ నిర్మాణానికి రూ.11.95 కోట్ల నిధులను కేటాయిస్తూ సీఎం స్వయంగా శంకుస్థాపన చేశారు. తాజా నిర్ణయాల ప్రకారం కవిటి మండలం ఇద్దువానిపాలెంలో రూ. 12 కోట్లతో మరో జెట్టీ నిర్మాణాలతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెంలో రూ.332 కోట్లతో షిషింగ్‌ హార్బర్, డి.మత్స్సలేశం (రాళ్లపేట)లో రూ.21.92 కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రం నిర్మాణానికి నిధులు కేటాయించారు. దీంతో మత్స్యకారుల జీవన ముఖచిత్రాలే పూర్తిగా మారిపోనున్నాయి.  

ఎక్కడ ఉంటే అక్కడికే పింఛన్‌ 
శ్రీకాకుళం పాతబస్టాండ్, నరసన్నపేట: పింఛన్‌ పంపిణీ అర్థాన్ని పూర్తిగా మార్చేసిన ఏడాది ఇదే. గంటల తరబడి క్యూలో ఉండడం వంటి బాధలను లబి్ధదారులు పూర్తిగా మర్చిపోయారు. 2019 ఏ ప్రిల్‌లో ఎన్టీఆర్‌ పింఛను పథకం కింద 3,50,268 మంది పింఛన్‌దారులకు రూ.74.49 కోట్లు జిల్లాకు అందజేయగా ప్రస్తుతం పింఛన్‌దారుల సంఖ్య 3,65,334 మందికి పెరిగింది. వీరికి ప్రస్తుతం రూ.87.38 కోట్లు అందిస్తున్నారు. పింఛన్‌ మొ త్తాన్ని కూడా రూ.2250కు పెంచారు. కిడ్నీ రోగులకు రూ. 10 వేలు అందజేశారు. అలాగే దీర్ఘకాలిక రో గులకు కూడా రూ.10,000 పింఛను అందజేసే కా ర్యక్రమాన్ని తీసుకువచ్చారు. వృద్ధాప్య పింఛన్‌ వ యో పరిమితిని 60 ఏళ్లకు కుదించారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్‌ అందుకోలేకపోయిన అభాగ్యులను ఆదుకున్నారు. అన్నింటికీ మించి వలంటీర్ల ద్వా రా ఉన్న చోటకే పింఛన్‌ వచ్చేలా చేసి ప్రశంసలు అందుకున్నారు. 

అభాగ్యులకు అండగా 
ఇచ్ఛాపురం రూరల్‌: మీ కష్టాలను చూశాను. మీ బాధలను విన్నాను, మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో ప్రతిపక్ష నేత హో దాలో ప్రతిజ్ఞ చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేసి ఆదుకున్నారు. మొత్తం 12 రకాల పింఛన్లు జి ల్లాలో అందిస్తున్నారు.  
వృద్ధాప్య పింఛను: ఆధార్‌ కార్డు ప్ర కారం తెలుపు కార్డుదారులై ఉండి, దారిద్య్ర రేఖ కు దిగువ ఉండి, వయస్సు 60 ఏళ్లు నిండిన వారందరూ ఈ పింఛన్‌కు అర్హులే. ప్రస్తు తం నెలకు రూ.2,250 ఇస్తున్నారు, రెండో విడతగా రూ.250, మూడో విడతగా రూ.250, నాల్గో విడతగా రూ.250లు పెంచుకుంటూ చివరకు రూ.3 వేలు ఇస్తారు. ప్రస్తుతం జిల్లాలో 166721 మంది లబి్ధదారులకు రూ.3888.77 లక్షలు అందుతున్నాయి.

దివ్యాంగులకు: వయసుతో సంబంధం లేకుండా 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్లు సదరన్‌లో ప్రభుత్వ వైద్యశాఖ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం స మరి్పంచాలి. ప్రస్తుతం నెల కు రూ.3వేలు పింఛను ప్ర భుత్వం అందిస్తోంది. జి ల్లాలో 34015 మంది లబి్ధదారులు ఉండగా, రూ.1077.17 లక్షలు అందుతున్నాయి.
 
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు: మూత్రపిండాల వ్యాధి బారిన పడిన రోగులు, క్రమం తప్పకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చికత్స చేయించుకుంటున్న వారు ఈ పింఛన్‌ పొందడానికి అర్హులు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పింఛన్‌ ప్రతిపాదన ప్రభుత్వానికి పంపిస్తే ప్రతి నెల రూ.10వేలు చొప్పున వ్యాధి గ్రస్తునికి ఇస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్‌ చికిత్స సెంటర్లకు చెందిన వారికి మంజూరైన పింఛన్‌ సొ మ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు, ప్రైవేటు ఆస్పత్రిలోని డయాలసిస్‌ చికిత్స కేంద్రాలకు చెందిన వారికి మంజూరైన పింఛన్‌ సొమ్ము వైఎస్సార్‌ పింఛన్‌ కానుకలతో పాటు ప్రతి నెలా అధికారుల చేత లబ్ధిదారుల ఆధార్‌ ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. ప్ర స్తుతం జిల్లాలో 613 మంది ఈ పింఛన్‌ను తీసుకుంటుండగా, ప్రస్తుతం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులను గుర్తించి వారి మందులకు ప్రతి నెల అయ్యే ఖర్చు రూపంలో ప్రభుత్వం జిల్లాలో 406 మందిని గుర్తించి వారికి ప్రతి నెల రూ.5000 చొప్పున్న పింఛన్‌ సొమ్మును అందిస్తోంది.

చేనేత పింఛన్‌: ఆధార్‌ కార్డు ప్ర కారం వయస్సు 50 ఏళ్లు నిండాలి. చేనేత వృత్తి చేస్తూ హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్‌ శాఖ అధికారుల నుంచి చేనేత వృత్తి పనివారిగా ధ్రువీకరణ పత్రం తేవాలి. ఈ పింఛనుకు కులాలతో పనిలేదు. ప్రస్తుతం జిల్లాలో 5246 మంది లబి్ధదారులకు 126.48 లక్షలు అందిస్తోంది.  

కల్లుగీత పింఛన్‌: ఆధార్‌ కార్డు ప్రకారం వయస్సు 50 ఏళ్లు నిండినవారై ఉండాలి. కల్లుగీత వృత్తిలో ఉన్నట్లు ఎక్సైజ్‌ శాఖ నుంచి «ధ్రువీకరణ పత్రం పొందాలి. 1366 మంది లబి్ధదారులు ఉండగా, వారికి రూ.31.79 లక్షలు ప్రతి నెలా అందుతున్నాయి.  

మత్స్యకార పింఛన్, వేట నిషేధ భృతి: 
ఆధార్‌ కార్డు ప్రకా రం 50 ఏళ్ల వయ స్సు నిండాలి. మత్స్యకార వృత్తి చేస్తూ చేపలు పట్టడానికి లైసెన్స్‌ లేక మత్స్యశాఖ నుండి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి. కులాలతో సంబంధం లేదు. సముద్ర, భూభాగ మత్స్యకారులై ఉండాలి. జిల్లాలో 6069 మంది మత్స్యకారులకు 149.60 లక్షలు ఇస్తుండగా, ఏటా ఏప్రిల్, మే నెలలో వేట నిషేధిస్తుండటంతో పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రూ.10,000 చొప్పున ప్రభుత్వం వేట నిషేధ భృతిని అందిస్తోంది. జిల్లాలో 14,289 మంది మత్స్యకారులకు ప్రభుత్వం రూ.142.890లక్షలు చెల్లిస్తోంది.
 
వితంతువులకు :  ఆధార్‌ కార్డు ప్రకారం వయస్సు 18 ఏళ్లు నిండి భర్త మృతి చెందిన మహిళలు ఈ పింఛన్‌ పొందడానికి అర్హులు. వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమరి్పంచాలి. జిల్లాలో 125438 మంది లబ్ధిదారులు ఉండగా, రూ.2979.77 లక్షలు అందిస్తోంది.

ఒంటరి మహిళలకు: గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి వయస్సు ఆధార్‌ కార్డు ప్రకారం 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 35 ఏళ్లు నిండినవారు ఈ పింఛనుకు అర్హులు. భర్త నుంచి విడాకులు పొందిన వారు, భర్తతో ఏడాది పాటు ఎడబాటుగా ఉన్న ఒంటరి మహిళలు, 30 ఏళ్లు దాటినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్న వారు ఈ పింఛన్‌ పొందడానికి అర్హులు. ఒంటరి మహిళా «ధ్రువీకరణ పత్రాన్ని తహసీల్దార్‌ చేత పొంది జతచేయాలి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 10364 మంది లబి్ధదారులకు రూ.248.87 లక్షలు అందిస్తోంది.
 
హిజ్రాలకు: ఆధార్‌ కార్డు ప్రకారం 18 ఏళ్లు నిండిన వారు ఈ పింఛన్‌లకు అర్హులు. నెలకు రూ.3వేలు చొప్పున ఇస్తారు. తప్పని సరిగా ప్రభుత్వ మెడికల్‌ బోర్డు నుంచి హిజ్రా అనే ధ్రువీకరణ పత్రం తేవాలి. జిల్లాలో 84 మంది హిజ్రా లబ్ధిదారులు ఉండగా వారికి నెలకి 2.64లక్షలు ప్రభుత్వం అందిస్తోంది.

డప్పు కళాకారులకు: ఆధార్‌కార్డు ప్రకారం 50 ఏళ్లు నిండి డప్పు కొట్టే వృత్తిలో ఉన్నవారు అర్హులు. నెలకు రూ.3 వేలు పింఛన్‌ రూపంలో ఇస్తారు. డప్పుకొట్టే వృత్తిలో ఉన్నట్లు సాంఘిక సంక్షేమ శాఖచే ధ్రువీకరణ పత్రం పొందాలి. తమ ఆధార్, రేషన్‌ కార్డు, డప్పు కళాకారుని గుర్తింపు ఫొటో, ధ్రువీకరణతో పాటు మీసేవ కేంద్రం ద్వారా పింఛన్‌కు దరఖాస్తు పంపాలి. సాంఘిక సంక్షేమ శాఖ ప్రతిపాదనలు పంపించి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో 1297 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం 40.56 లక్షలు అందిస్తోంది.

చర్మకారులకు: చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉన్న వారికి రూ.2,250 పింఛన్‌ రూపంలో ఇస్తారు. ఆధార్‌ కార్డు ప్రకారం 50 ఏళ్లు నిండాలి. చర్మకార, చెప్పులు కుట్టుకునే వృత్తి చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వృత్తి ధ్రువీరకణ పత్రం పొంది ఉండాలి. జిల్లాలో 366 మంది చర్మకారులకు ప్రభుత్వం నెలవారీ రూ.8.91 లక్షలు అందిస్తోంది.

ఎయిడ్స్‌ బాధితులకు: ఎయిడ్స్‌ బాధితులకు నెలకు రూ.2,250 పింఛన్‌ ఇస్తున్నారు.  ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేటు ఏటీఆర్‌ సెంటర్‌ల ద్వారా అమలు చేస్తారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా