241వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర

20 Aug, 2018 09:26 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని..  భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత చేపట్టిన పాదయాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు గ్రామమైన ధర్మసాగరం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. ధర్మసాగరం దగ్గర మహిళలు బారులు తీరి... వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు.  కాగా చినుకులు పడుతున్నా పాదయాత్ర కొనసాగుతోంది. వర్షంలోనూ జననేత నడక సాగిస్తున్నారు. అశేష జనవాహిని వెంటరాగా అడుగులు ముందుకు వేస్తున్నారు.

మీరు ముఖ్యమంత్రి అయితేనే..
పాదయాత్రలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు వైఎస్‌ జగన్‌ను కలిసి... గిరిజనుల సమస్యలను వివరించారు. నర్సింగ్‌ విద్యార్థులు కూడా తమ సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా..  టీడీపీ హయాంలో నోటిఫికేషన్లే లేవని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఉద్యోగాలు వస్తాయన్న భరోసాతో ఉన్నామంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. వికలాంగులు కూడా తమ సమస్యల గురించి ఆయనకు వివరించారు.  ఇక మరికాసేపట్లో వైఎస్‌ జగన్‌ పాయకరావుపేట నియోజకవర్గంలో అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాత యండపల్లి, జల్లూరు, పాత తంగేడు, తంగేడు క్రాస్‌ మీదుగా కోట ఉరట్ల, కైలాసపట్నం వరకు ఇవాళ్టి పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం కోట ఉరట్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.

మరిన్ని వార్తలు