66వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

20 Jan, 2018 09:13 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 66వ రోజుకు చేరుకుంది. పాదయాత్రలో అడుగు.. అడుగూ ఏకమవుతోంది. పల్లెపల్లె కదలి వస్తోంది. తమ సమస్యలు ఆలకించేందుకు వచ్చిన రాజన్నబిడ్డకు అభిమాన హారతి పడుతున్నారు. శనివారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని కుక్కలవారి కండ్రిగ గ్రామం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు.

అక్కడి నుంచి వెంకటాపురం క్రాస్, కుమ్మర మిట్ట, మోదుగు పాలేం క్రాస్, కొత్త వీరాపురం, అగ్రహారం, కంబాక, అంజిమీడు క్రాస్‌కు పాదయాత్ర చేరుకుంటుంది. దారిపొడవునా ఆయన ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం ఏర్పాడు, మేర్లపాక క్రాస్‌ మీదుగా చిందేపల్లి వరకు కొనసాగనుంది. కొత్తవీరాపురం, మేర్లపాక హరిజనవాడలో వైఎస్సార్‌సీపీ జెండాను జగన్‌ ఆవిష్కరిస్తారు. రాత్రికి చిందేపల్లిలో వైఎస్‌ జగన్‌ బస చేస్తారు.

మరిన్ని వార్తలు