ప్రతి అడుగూ ఓ భరోసాగా..!

16 Dec, 2018 12:23 IST|Sakshi

ముందుకు సాగుతున్న జగన్‌ ప్రజాసంకల్పయాత్ర

శ్రీకాకుళం నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి

 నరసన్నపేట నియోజకవర్గంలో ఘనస్వాగతం

 నేడు నరసన్నపేటలో బహిరంగ సభ  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రతి అడుగు.. ఓ భరోసాగా ప్రజల సమస్యలను వింటూ వారి కన్నీళ్లు తుడుస్తూ  ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రధాన ప్రతి పక్ష నేత, వైఎ స్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రజాసంక ల్పయాత్రకు నరసన్నపేట నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శనివారం సాయంత్రం మడపాం వద్దకు జగన్‌ యాత్ర చేరగానే పెద్ద ఎత్తున ‘ జై జగన్‌’ అంటూ నినాదాలు వెల్లువెత్తాయి. వంశధార నది బ్రిడ్జిపై నిండైన జనం జగనన్నకు ఘన స్వాగతం పలికి, తమ సమస్యలను తీర్చాలని కోరారు. అంతకుముందు సంక ల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం లోని నైరా సమీపం నుంచి భైరి కూడలి వరకు యాత్ర సాగిం ది. ఈ మార్గమధ్యంలో వందలాది మంది ప్రజలు జగ న్‌ను కలిసేందుకు ఉత్సాహం చూపించారు. ప్రతి ఒక్కరిని పలకరించి, వారి అవస్థలను దగ్గరుండి తెలుసుకుని పరిష్కార మార్గాలను జగన్‌ వివరించారు.  

యాత్ర సాగిందిలా 
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలోని నక్కపేట క్రాస్‌ నుంచి యాత్రను ప్రారంభించారు. అలికాం క్రాస్, నైరా, కరిమిల్లి పేట క్రాస్, రోణంకి క్రాస్, భైరి కూడలి, కరజాడ మీదుగా నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం, దే వాది వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ సామాజిక వర్గాల వారు జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. వారిలో మంచాన పడ్డ తమ కొడుకుల వ్యధలను వివరించిన ఇద్దరు మహిళలతో జగన్‌ ప్రత్యేకంగా మాట్లాడారు.  

నరసన్నపేట సరిహద్దులో ఘన స్వాగతం
ప్రజాసంకల్పయాత్ర శనివారంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో పూర్తి అయింది. సాయంత్రం నుంచి నరసన్నపేట నియోజకవర్గంలో యాత్ర ఘనంగా ప్రవేశించింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలంతా వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన శ్రేణులంతా మడపాం బ్రిడ్జి వద్ద సాదర స్వాగతం పలికారు. 

విద్యార్థులతో పాటే నేలపై కూర్చొని..
శ్రీకాకుళం మండలంలోని నైరా వ్యవసాయ కళాశాల బీఎ స్సీ (అగ్రికల్చర్‌) విద్యార్థులు గత నాలుగు రోజులుగా తమ డిమాండ్ల కోసం కళాశాల ఎదురుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. అటు వైపు పాదయాత్రగా వస్తున్న జగన్‌ విద్యార్థుల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్లారు. ధర్నా శిబిరం వద్ద వారితో పాటు నేలమీదే కూ ర్చుని ఓ అరగంట సమయం ముచ్చటించారు. ముందుగా విద్యార్థుల డిమాండ్లు, వాటి పర్యవసానాలు, ఉద్యోగ అర్హతల్లో మార్పులు తదితర విషయాలపై చర్చించారు.  

యాత్రలో  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి, పార్టీ రీజ నల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దు వ్వాడ శ్రీనివాస్, అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌ రాజు, పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, టెక్కలి, ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్తలు పేరాడ తిలక్, గొర్లె కిరణ్‌కుమార్, యువనేతలు ధర్మాన రామమనోహర్‌ నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్, ధర్మాన కృష్ణ చైతన్య, పార్టీ సంయక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయ్, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు చింతాడ మంజు, వైద్యుడు దానేటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 
  
నేడు నరసన్నపేటలో బహిరంగ సభ
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నరసన్నపేట వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈమేరకు ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలంతా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు