జనంతో మమేకమవుతూ..

18 Sep, 2018 07:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జన క్షేమమే తన క్షేమమంటూ జననేత వేస్తోన్న ప్రతి అడుగూ కష్టాల కడలిని ఎదురీదుతున్న ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. రేపటి ఆశలకు ఊపిరులూదుతోంది. కష్టాలతో కాలం గడుపుతున్న ప్రజలకు నేనున్నానంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 264వ రోజు భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల పరిధిలోని పల్లెల మీదుగా సాగింది. ఆనందపురం మండంలోని గుమ్మడివానిపాలెం నుంచి ప్రారంభమైన  పాదయాత్ర నీలకుండీలు, మిందివానిపాలెం, గుడిలోవ, తర్లువాడ క్రాస్, దుక్కవానిపాలెం, ఈగలవానిపాలెం, లొడగల వానిపాలెం గ్రామాల మీదుగా ఆనందపురం వరకు సాగింది. దారి పొడవునా ఎండతీక్షణంగా కాస్తున్నా లెక్కచేయక జననేత వెంట వేలాది అడుగులు కదంతొక్కాయి. పాదయాత్ర ప్రారంభించే ముందు విశ్వకర్మ జయంతి సందర్భంగా శిబిరం వద్ద ఆయన చిత్ర పటానికి జననేత వైఎస్‌ జగన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం  భీమిలి కో ఆర్డినేటర్‌ అక్కరమాని విజయనిర్మల, భీమిలి పట్టణాధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావు, పార్టీ విశాఖ పార్లమెంటుజిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్లమెంటు కో ఆర్డినేటర్‌ ఎంవీవీ సత్యనారాయణలతో పాటు పార్టీ నేతలు వెంటరాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన వైఎస్‌ జగన్‌కు నీళ్లకుండీలు జంక్షన్‌కు చేరుకోగానే పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఎదురేగి స్వాగతం పలికారు. ఇదేజంక్షన్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస ప్రోత్సాహం లభించడం లేదని స్కేటింగ్‌ క్రీడాకారులు ఫణీంద్ర, పృథ్విరెడ్డి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. మిందివానిపాలెం, గుడిలోవ క్రాస్, తర్లువాడ క్రాస్‌ మీదుగా పాలవలస జంక్షన్‌ వద్ద భోజన విరామానికి ఆగారు. అనకాపల్లి–సబ్బవరం–ఆనందపురం హైవే విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి తగిన పరి హారం ఇచ్చేలా చూడాలని తర్లువాడ మాజీ సర్పం చ్‌ వెంకట్రావు జగన్‌ను కలిసి వేడుకున్నారు. దుక్కివానిపాలెం నుంచి మధ్యాహ్నం ప్రారంభమైన పాదయాత్ర వేములవలస, ఎల్వీపాలెం మీదుగా ఆనందపురం వరకు సాగింది.మార్కెట్‌ సెంటర్‌లో జరిగిన  బహిరంగ సభ అనంతరం ఆనందపురం శివారలో రాత్రి శిబిరానికి చేరుకున్నారు.

సంకల్పయాత్రలో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, పాదయాత్ర ప్రొగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్‌రాజు, తిప్పల నాగిరెడ్డి, కె.కె.రాజు, డాక్టర్‌ పి.వి.రమణమూర్తి, గొల్ల బాబూరావు, చెట్టి పాల్గుణ, రెడ్డి శాంతి, సీఈసీ సభ్యుడు కె. శ్రీకాంత్‌రాజు, కాకర్లపూడి వరహాలరాజు, పాడేరు నుంచి గొడ్డేటి మాధవి, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దాట్ల వెంకట అప్పల ప్రసాదరాజు, తాడి విజయభాస్కరరెడ్డి, సుంకర గిరిబాబు, రాష్ట్ర అదనపు కార్యదర్శులు గోలి శరత్‌రెడ్డి, పక్కి దివాకర్, రవిరెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్‌ కార్యదర్శి ఫరూకీ, నగర ఎస్సీసెల్‌ నగర, పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు బోని శివరామకృష్ణ,  రెయ్యి వెంకటరమణ, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు బి.కాంతారావు, నగర యూత్‌ అధ్యక్షుడు కొండా రాజీవ్‌ గాంధీ, ఆడిటర్‌ జి.వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌ కడప నుంచి మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చంద్రహాస్‌రెడ్డి, చవ్వా శివకృష్ణారెడ్డి, రాణా ప్రతాప్‌రెడ్డి, హుస్సేన్‌ ఆలీ, భైరెడ్డి విజయభాస్కరరెడ్డి, ఎ.వి.ప్రతాప్, పెనుమంట్ర నుంచి జె.డి.సూర్యారావు, రంగనాయకమ్మ, ఎస్‌.వి.రమణ, గుడివాడ నుంచి వై.సాయిప్రసాద్, బనగానపల్లి నుంచి కె.శ్రీనివాస నాయక్, చినబాబు, మల్కిరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ కోరాడ వెంకటరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు