జనబాంధవుడు

23 Sep, 2018 06:57 IST|Sakshi
కోలవానిపాలెం క్రాస్‌ వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర

జననేతకు బ్రహ్మరథం పట్టిన పల్లెలు కొండకోనల్లో సాగిన 267వ రోజు పాదయాత్ర

నెట్‌వర్క్‌ పనిచేయని గ్రామాల్లో ప్రజల కష్టాల విన్నపాలు

సమస్యలు వింటూ..కన్నీళ్లు తుడుస్తూ భరోసా ఇచ్చిన జగన్‌

సాక్షి, విశాఖపట్నం: అందరివాడై..ఆప్తబంధువై వడివడిగా అడుగులేస్తూ వస్తోన్న జనబాంధవుడుతో పల్లెలు పరవశించిపోతున్నాయి.వేగుచుక్కలా..వెలుగు దివిటీలా దూసుకొస్తున్న రాజన్న బిడ్డను చూసి పులకించిపోతున్నాయి. కొండ కోనలైనా..మారుమూల పల్లెలైనా..జన వాహినులవుతున్నాయి. జననేతను చూడగానే వేల నయనాలు విచ్చుకున్న అరవిందాలవుతున్నాయి. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. తమ కష్టాలు చెప్పుకుని భరోసానిచ్చే ఆ మాటతో ఊరట చెందుతున్నాయి.  

మహా విశాఖ నగరానికి కూతవేటు దూరంలో నట్టడవిని తలపించే కొండకోనల్లో మారు మూల పల్లెల మీదుగా సాగింది 267వరోజు ప్రజాసంకల్పయాత్ర. భీమిలి కో ఆర్డినేటర్‌ అక్కరమాని విజయనిర్మల, విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్,పార్లమెంటు కో ఆర్డినేటర్‌ ఎంవీవీ సత్యనారాయణ తదితర పార్టీ నేతలు వెంటరాగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం పప్పలవానిపాలెం శివారు నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అక్కడనుంచి పాదయాత్ర పప్పలవానిపాలెం క్రాస్, కోలవానిపాలెం క్రాస్, భీమన్నదొర పాలెం ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఎర్రవానిపాలెం క్రాస్,రామవరం మీదుగా గండిగుండం క్రాస్‌ వరకు శనివారం 5.9 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగింది. పాదయాత్ర సాగిన ఈ పల్లెలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న భీమన్న దొర పాలెం, తంగుడు బిల్లి, గిడిజాల, కణమాం, శొంఠ్యం గ్రామాల నుంచి వేలాదిగా జననేతను చూసేందుకు పోటెత్తారు. జగన్‌తో సెల్ఫీలు తీయించుకునేందుకు ఉత్సాహం చూపారు.

సమాచార వ్యవస్థకు దూరంగా..
ఇంటింటికీ ఫైబర్‌ నెట్‌ ద్వారా రూ.149లకే టీవీ,ఇంటర్నెట్, టెలిఫోన్‌ కనెక్షన్లు ఇచ్చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది.ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును పైలట్‌గా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టిన విశాఖ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాల్లో ఎలాంటి సమాచార వ్యవస్థ లేని దుస్థితి. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నా కనీసం ప్రభుత్వరంగ సంస్థయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ కూడా పనిచేయని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భూములేకాదు..పేదల భూములు వదలడం లేదయ్యా
మరో వైపు భీమిలి కేంద్రంగా సాగుతున్న భూ కబ్జాలపై  ప్రజాగ్రహం పెల్లుబికింది. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, ఇతర టీడీపీ నేతలు సాగిస్తున్న భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చందక గ్రామంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని మంత్రి గంటా ప్రోద్భలంతో ఆయన అనుచరులు కబ్జా చేశారని, చివరకు శ్మశాన వాటికను కూడా వదల్లేదని  గ్రామస్తులు జగన్‌కు దృష్టికి సుకొచ్చారు. భీమన్నదొరపాలెం ఎస్సీ కాలనీలో దళితులకు అరకెర చొప్పున కేటాయించిన డి.పట్టాభూములను అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌ కుటుంబీకులు కబ్జా చేశారని బాధితులు జగన్‌ వద్ద మొరపెట్టుకున్నారు. ఇదే గ్రామంలో గ్రామకంఠం భూములను కూడా కబ్జాకోరులు వదల్లేదన్నా అంటూ వాపోయారు. పద్మనాభస్వామి దేవస్థానానికి చెందిన 2,448 ఎకరాల భూములు సాగు చేసుకుంటున్న తమకు హక్కులు కల్పించాల్సింది పోయి వేలం వేస్తామంటూ బెదిరిస్తున్నారని సాగుదారులు జగన్‌ను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు.

సంకల్పయాత్రలో పాదయాత్ర టూర్‌ ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే వి.కళావతి, మాజీ మంత్రులు పి.సాంబశివరాజు, బొత్స సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శులు దాట్ల వెంకట అప్పల ప్రసాదరాజు, సుంకర గిరిబాబు, ఎల్‌.ఎమ్‌.మోహన్‌రెడ్డి, విశాఖ పార్లమెంట్‌ జిల్లా మహిళ అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, నగర మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరి, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్ల చంద్రశేఖర్, విద్యార్థి విభాగం విశాఖ, అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు బి.కాంతారావు, తడబారిక సురేష్‌ కుమార్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, విజయనగరం నుంచి అవనాపు విక్రమ్, గాడు అప్పారావు, పిల్లా విజయ్, నంద్యాల నుంచి కరుప శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి నుంచి పేరం గోకుల్‌నాథరెడ్డి, ఆళ్లగడ్డ నుంచి నరసింహశర్మ, మాజీ ఎంపీపీ కోరాడ వెంకటరావు, జిల్లా నాయకులు అక్కరమాని వెంకటరావు, చొక్కాకుల వెంకటరావు, బంక సత్యం, కాకర్లపూడి సీతారామరాజు, గండ్రెడ్డి శ్రీనివాస్, బోకం శ్రీనివాస్, మల్లువలస జగదీశ్వరరావు, యతిరాజుల నాగేశ్వరరావు, కాద సూర్యనారాయణ, అక్కరమాని మంగరాజు, ఎలమంచిలి సూర్యనారాయణ, జీరు వెంకటరెడ్డి, కొండపు కొత్తయ్యరెడ్డి, కాసరపు పెద ఎల్లాజీ, మారుపల్లి రాము, వాడమొదల జగ్గారావు, నక్కా కనకరాజు, కోరాడ లక్ష్మణ, మాజీ ఎంపీపీ ఎం.వి.జి.రాజు తదితరులు పాల్గొన్నారు.

చరితలో నిలిచిపోయే పాదయాత్ర
ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం జగనన్న పాదయాత్ర చేయడం చరిత్రలో నిలిచిపోతోంది. దీన్ని ఎవరూ అధిగమించలేరు. తాను పులివెందులనుంచి జగనన్నతో నడుస్తున్నా. ఎనిమిదేళ్లుగా పార్టీలో సేవ చేస్తున్నా.  రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. నవరత్నాలే ఆయనను గెలిపిస్తాయి. ఈపథకాలు బడుగు బలహీన వర్గాల రూపురేఖలు మార్చేస్తాయి. జగనన్న సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా గుర్తుగా ఫొటో ఫ్రేమ్‌ అందజేశా.  –బొట్టా రమాదేవి, విశాఖపట్నం, 6వ వార్డు

జగనన్న కోసం పాట రాసా
నాది గోపాలపురం గ్రామం పెల్లిమారి మండలం, కడప జిల్లా. వ్యవసాయ కుటుంబం. డిగ్రీ పూర్తిచేశాను. కానీ ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో వ్యవసాయ పనుల్లో  నాన్నకు సాయం చేçస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నా. జగనన్న అంటే చాలా ఇష్టం. జగనన్నపై రాసిన పాటను జగనన్నకు చూపించాను. పాట ఉద్దేశం, ముఖ్యంశాలను అడిగి తెలుసుకున్నారు. చాలా ఆనందంగా ఉంది.–జ్యోతేశ్వరరెడ్డి

మరిన్ని వార్తలు