నేనున్నానని..

24 Sep, 2018 06:47 IST|Sakshi
సరిపల్లి కాలనీ వద్ద దివ్యాంగుడిని ఆప్యాయంగా పలకరిస్తున్న జననేత జగన్‌

జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర జిల్లా వాసులకు భరోసా ఇచ్చింది. వారి బాధలు, ఇబ్బందులు చెప్పుకోవడానికి వేదికైంది. అన్ని వర్గాల సమస్యలు, ఇబ్బందులను  స్వయంగా తెలుసుకున్న సంకల్పసూరీడు వారికి నేనున్నాని అభయమిస్తూ ముందుకు సాగారు. మన ప్రభుత్వంలో అందరికీ మేలు చేద్దామని ధైర్యం చెప్పారు.

విశాఖపట్నం, నక్కపల్లి(పాయకరావుపేట):  ప్రజాసంకల్ప యాత్ర ద్వారా విశాఖ జిల్లాలో పాదయాత్ర చేసిన ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి జిల్లా ప్రజానీకం పలు సమస్యలు తీసుకొచ్చారు. బాధితులు స్వయంగా  ఈ ప్రభుత్వం వల్ల, టీడీపీ నాయకుల కక్షసాధింపుల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తను ముందు వివరించడాన్ని చూసి జగన్‌ చలించి పోయారు. ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ తండ్రి నడిచిన బాటలోనే తాను కూడా నడుస్తూ ప్రజల కష్టాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన జననేతకు ప్రజలు తమ సమస్యలను నివేదించారు.  నీవు సీఎం అయి రాజన్న పాలన తేవాలి బాబూ అంటూ ఆశీర్వదించారు.

అడుగుడుగూ ప్రభంజనమై
గత నెల 14న నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన జననేతకు అడుగడుగునా ప్రజానీకం ఘన స్వాగతం పలికారు. గుండెల్ని పిండి చేసే సమస్యలు ఇబ్బందులను కూడా  విన్నవించుకున్నారు. నష్టాల్లో ఉన్న చక్కెర కర్మాగారాలు, మూతపడిన సుగర్‌ఫ్యాక్టరీలు వాటిలో పనిచేసే కార్మికులకు  ఏళ్లతరబడి జీతాలు చెల్లించకపోవడంతో వారు ఆత్మ హత్యలకు పాల్పడడం,ఆర్థిక ఇబ్బందులు  ఎదుర్కొవడం వంటి సమస్యలను బాధితులు జగన్‌కు  వివరించారు. పాయకరావుపేట,తుమ్మపాల, గోవాడ ఫ్యాక్టరీల రైతులు, కార్మికులు జగన్‌ను కలసి తమ బాధలు చెప్పుకున్నారు. తుమ్మపాల ఫ్యాక్టరీ మూతపడడం వల్ల కార్మికులకు 49నెలల జీతాలు చెల్లించ లేదని వివరించారు.  ఆర్థిక ఇబ్బందులతో 32 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రైతులు వివరించారు.13వేల మంది రైతులు సుమారు 300 మంది కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వారు కన్నీటిపర్యంతమయ్యారు.

ఆప్తులకు జననేత భరోసా
మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీలను ఆదుకుంటామని జగన్‌ భరోసా ఇచ్చి రైతుల్లో ధైర్యాన్నింపారు. ఇక పెందుర్తి మండలంల  జెర్రిపోతుల పాలెంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అను చరులు దళిత మహిళలను వివస్త్రను చేసి ఈడ్చుకుంటూ Ðð వెళ్లి కొట్టడం ఆమె భూమిని కబ్జా చేయాలని ప్రÄయత్నించడం వంటి ఘనటలను బాధితులు జగన్‌కు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. వీటిని విన్న జగన్‌ ఈ ప్రభుత్వంలో ఇంత దారుణాలు జరుగుతున్నాయా అంటూ బహిరంగ సభల్లో నిప్పులు చెరిగారు. పెందుర్తిలో బండారు అనుచరులు, భీమిలి నియోజకవర్గంలో మంత్రి గంటా భూ కుంభకోణాలను ఎండగట్టారు.

అడుగడుగునా నివేదనలు
వైఎస్సార్‌సీపీకి ఓటేసామని నా పింఛన్‌ తీసేశారు బాబూ అంటూ ములగపూడికి చెందిన  వొలిమి మహాలక్షి అనే వృద్ధురాలు వాపోయింది. న్యూ ఇయర్‌ సందర్భంగా జగన్‌ ఫెక్ల్సీ  పెట్టినందుకు మా మామయ్య పింఛన్‌ రద్దుచేశారని సునీత అనే మహిళ వాపోయింది. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరానని చెప్పి నా ఓటు తీసేశారంటూ శివపురానికి చెందిన అవుగడ్డ సత్యనారాయణ వాపోయాడు. దాదాపు పదేళ్లుగా పనిచేస్తున్న  తమను రెగ్యులర్‌ చేయడం లేదంటూ 104,108 వాహనాల్లో పనిచేస్తున్న  ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమచేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ పనికి తగిన వేతనాలు చెల్లించడం లేదంటూ  సెకెండ్‌ ఏఎన్‌ఎంలు, ,ఆశకార్యకర్తలు జగన్‌ ముందు వాపోయారు. ఇక దాదాపు 15 ఏళ్లనుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన  పథకంలో నిర్వాహకులుగా, కార్మికులుగా పనిచేస్తున్న తమను తొలగించి ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సర్కార్‌ నిర్ణయించిందంటూ కార్మికులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

భూ కబ్జాలపై వినతులు
నక్కపల్లి మండలం పెదదొడ్డగల్లులో 300 ఎకరాల డీఫారం భూమిని కారు చౌకగా కొట్టేయడానికి లోకేష్‌తోపాటు మరో ఇద్దరు మంత్రులు ప్రయత్నిస్తున్నారంటూ ముస్లింలు, యాదవులు జగన్‌కు ఫిర్యాదు చేశారు.  మా తండ్రిని హత్య చేసిన వారిని గుర్తించి శిక్షించడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని నిందితులకు కొమ్ముకాస్తున్నారంటూ పాయకరావుపేట మండలం అరట్లకోటకు ఎందిన శకునాల రమణ, లతలు జగన్‌కు ఫిర్యాదు చేసారు. ఇక అగ్రిగోల్డ్‌ బాధుతుల రోధన వర్ణనాతీతం. డిపాజిట్‌ దారుల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నాÐనని,దార్లపూడిలో చంటమ్మ అనే ఏజెంట్‌ కన్నీటి పర్యంతమయింది. అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేసిన సొమ్ము రాకపోవడంతో నా కుమార్తె ఎంబీబీఎస్‌ చదువు మధ్యలో ఆగిపోయిందని మర్రివలసలో జె. వరలక్ష్మి అనే మహిళ వాపోయింది. వేలిముద్రలు పడకపోవడం వల్ల పింఛన్లు, రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదని పలువురు వాపోయారు. ఆటోలపై పోలీసులు కేసులు నమోదు చేసి వేలల్లో పెనాల్టీలు వసూలు చేçస్తున్నారంటూ డ్రైవర్లు జగన్‌కు వివరించారు.చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు కట్టకపోవడంతో తాకట్టు భూమిని వేలం వేస్తామంటూ బ్యాంకువాళ్లు బెదిరిస్తున్నారని  పైడి రాజు అనే రైతు వాపోయాడు. డీగ్రీలు చదివినా ఉద్యోగాలు లేవని  నిరుద్యోగులు  జగన్‌కు వద్ద మొరపెట్టుకున్నారు.  పాదయాత్ర పొడవునా అన్ని వర్గాల సమస్యలు వింటూ నేనున్నాననే  భరోసా  ఇస్తూ మరో ఆరు మాసాల్లో మనందరి ప్రభుత్వం వస్తుందని క ష్టాలు తీరుతాÄయని హామీ ఇస్తూ జననేత జగన్‌ ముందుకు సాగారు.

మరిన్ని వార్తలు