ఉప్పొంగిన జగనాభిమానం

20 Nov, 2018 06:58 IST|Sakshi
అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో కలసి అడుగులు వేస్తున్న కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, అరకు, విజయనగరం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు

జననేతను చూసి ఉప్పొంగిపోయిన పల్లెవాసులు

దారి పొడవునా సమస్యలు చెప్పుకున్న బాధితులు

చిన్నారి జ్ఞానేశ్వరికి అక్షరాభ్యాసం చేసిన జననేత

తిత్లీ తుఫాన్‌లో నష్టపోయిన అరటి పంట పరిశీలన

పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్‌సీపీలో చేరికలు

సాక్షిప్రతినిధి విజయనగరం: ఆ వచ్చినది జగనన్న... అదే రాజన్న బిడ్డ. అందుకే ఆయన్ను చూడాలని పల్లెవాసులు పరితపించిపోయారు. మహానేత సమయంలో పొందిన లబ్ధితో ఎన్నో కుటుంబాలు కుదుటపడ్డాయి. ఎన్నో బతుకులు బాగుపడ్డాయి. కానీ దురదృష్టం గడచిన నాలుగున్నరేళ్లుగా వీరిని పట్టించుకునేవారే కరువయ్యారు. వీరి గోడు వినేవారే కానరాకుండా పోయారు. అందుకే తమవద్దకు వస్తున్న ఆ జననేతను కలవాలని... తమ బాధలు విన్నవించాలని... ఆయన భరోసాతో సాంత్వన పొందాలని కోరుకుంటున్నారు. ఆ ఆశతోనే జననేతకు ఎదురేగి స్వాగతం పలికారు. వారి అభిమానానికి ముగ్దుడైన జగనన్న వారి కష్టాలు సావధానంగా విన్నా రు. తొందరలోనే మంచి జరుగుతుందని ఆశపడుతున్నారు.

చిన్నారికి అక్షరాభాస్యం చేసిన జననేత
పాదయాత్రలో వై.ఎస్‌.జగన్‌ను కలసిన కృష్ణవేణి అనే మహిళ తన కుమార్తెకు అక్షరాభ్యాసాన్ని చేయించాలని కోరారు. ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న జననేత అక్షరాలను దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. పాదయాత్రలో అనేక చోట్ల పలువురు తల్లులు తమ బిడ్డలను ఆశీర్వదించాలని కోరుతూ జననేత చేతిలో పెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు. జగన్‌ కనిపించలేదని ఓ చిన్నారి ఏకంగా ఏడ్చేస్తుంటే జగన్‌ దగ్గరకు తీసుకుని స్వయంగా ఆ పాప కంటి నుంచి చెంపలపై జారుతున్న నీటిని తుడిచారు.

దారిపొడవునా జనాదరణ
జననేత జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర రోజురోజుకూ జన హృదయాలకు దగ్గరవుతోంది. 301వ రోజైన సోమవారం కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీ నుంచి పాదయాత్ర ప్రారంభించి తోటపల్లి క్రాస్, నందివానివలస, గిజబ మీదుగా  దత్తివలసకు చేరుకున్నారు. అక్కడ భోజన విరామానంతరం జియ్యమ్మవలస మండలంలోని గవరంపేట, పెదమేరంగి జంక్షన్‌ మీదుగా సీతంనాయుడువలస వద్ద ఏర్పాటు చేసిన రా త్రి బస వద్దకు చేరుకుంది. దారిపొడవునా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, రైతులు ఎదురేగి ను దుట విజయ తిలకం దిద్ది హారతులు పట్టారు. గిజబ గ్రామానికి ముందు ఏర్పాటు చేసిన ప్రత్యే క శిబిరంలో తిత్లీ తుపాన్‌ బాధితులు తమకు పరిహారాన్ని అరకొరగా అందజేశారని జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోగా..గ్రామ శివారుల్లో తుఫా న్‌తో నష్టపోయిన అరటిపంటను జననేత పరిశీ లించారు. స్థానిక మహిళా రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు.

పాదయాత్రలో వినతుల వెల్లువ
యాత్రలో దారిపొడవునా అనేక సమస్యలపై వినతులు అందిస్తూనే ఉన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు తమ సమస్యలను ప్రస్తావించారు. నాలుగేళ్లపాటు అన్యాయం చేసి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏమాత్రం అనుభవం లేని వ్యక్తికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారని చెప్పారు. అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న మైదాన ప్రాంత గిరిజన సమస్యలను పరిష్కరించడం లేదని వాపోయారు. భారీ ప్రాజె క్టు తమ చెంతనే ఉన్నప్పటికీ తమ భూములకు మాత్రం నీరందడం లేదని పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి భూములిచ్చినా తమకు తగిన పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిత్లీ తుఫాను బాధితుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు వెళ్లిన జననేతకు అరటి రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. నేలకొరిగిన చెట్లను తొలగించడానికే ఎకరాకు రూ.30వేలు ఖర్చవుతుందనీ, ప్రభుత్వం మాత్రం రూ.12 వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. గవరంపేట వద్ద తిరుమల సాయి విద్యానికేతన్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రైవేటు స్కూళ్లలోని నిరుపేదలకు కూడా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందజేయాలని కోరారు.

అలుపెరగని బాట సారి వెంట: పాదయాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజ యనగరం శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమ న కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి విశ్వరూప్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, కమలాపురం, మంగళగిరి, కురుపాం, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పాముల పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళా వతి, కంబాల జోగులు,  పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరుకు, విజయనగరం, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, బెల్లాన చంద్రశేఖర్, గుడివాడ అమర్‌నా«థ్, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మాధవి, విశాఖ తూర్పు,పార్వతీపురం, పాతపట్నం నియో జకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణయాదవ్, అలజంగి జోగారావు, రెడ్డి శాంతి, రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, పార్టీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, కురుపాం ఎంపీపీ ఎ.ఇందిరాకుమారి, అరకు పార్లమెంటరీ జిల్లా విద్యార్థి విభా గం రాష్ట్రకార్యదర్శి చెట్టి వినయ్, అరకు పార్లమెం టరీ జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు తడబరికి సురేష్‌కుమార్, పంచాయతీరాజ్‌ విభాగం మంగళగిరి జిల్లా అధ్యక్షుడు డి.వేమారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎల్‌ఎమ్‌ మోహన్‌రెడ్డి, భాగ్యలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరినఅరుకు టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు
రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న వైఎస్సార్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలం దత్తివానివలస వద్ద సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పార్టీ అరుకు నియోజకవర్గ సమన్వయకర్త చెట్టి ఫల్గుణ ఆధ్వర్యంలో 14 మంది టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు  జననేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వారందరికి పార్టీ కండువాలు వేసిన జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు