237వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

13 Aug, 2018 21:21 IST|Sakshi

విశాఖలోకి ప్రవేశించనున్న జననేత పాదయాత్ర

సాక్షి, నర్సీపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 237వ రోజు షెడ్యూలు ఖరారైంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం జననేత పాదయాత్రను తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కాకరాపల్లి నుంచి ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించనుంది.  నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్టా, శరభవరం, శృంగవరం చేరుకున్న అనంతరం భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. గాంధీ నగర్‌, వై. దొంగపేట జంక్షన్‌, ఎర్రవారం జంక్షన్‌ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. జననేతకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. 50 రోజులుగా 17 నియోజకవర్గాల్లో 32 మండలాలు, 232 గ్రామాల్లో దిగ్విజయంగా సాగిన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో రేపటితో ముగియనుంది.

ముగిసిన పాదయాత్ర:  వైఎస్‌ జగన్‌ 236వ రోజు పాదయాత్ర కోటనందూరు మండలం కాకరాపల్లి శివారులో ముగిసింది. నేడు ఆయన తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి తాటిపాక, బిళ్లనందూరు క్రాస్‌రోడ్‌, బొడ్డువరం క్రాస్‌రోడ్‌, జగన్నాథపురం, కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు 8.2 కిలోమీటర్ల మేర నడిచారు. దీంతో జననేత ఇప్పటివరకు 2,719.6 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసుకున్నారు. 
 

మరిన్ని వార్తలు