271వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

25 Sep, 2018 19:31 IST|Sakshi

సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 271వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. బుధవారం జననేత ఎస్‌.కోట నియోజకవర్గంలోని లక్కవరపు కోట మండలం రంగరాయపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సంతపేట, లక్కవరపు కోట మీదుగా ఖాశాపేట వరకు సాగనుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కుర్మవరం క్రాస్‌, తలరి మీదుగా కొట్యడ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 270వ రోజు ముగిసింది. మంగళవారం ఉదయం ఆయన తుమ్మికపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి అడ్డుపాలెం, నిమ్మలపాలెం, అప్పన్నపాలెం, గాంధీనగర్‌, గంగుపుడి జంక్షన్‌, మల్లివీడు, గోల్డ్‌స్టార్‌ జంక్షన్, జమ్మదేవిపేట మీదుగా రంగాపురం క్రాస్‌ వరకు జననేత పాదయత్ర కొనసాగింది.ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్‌ జగన్‌ నేడు 11.7 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటివరకు జననేత 3019.9 కిలోమీటర్లు నడిచారు.

మరిన్ని వార్తలు