170వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

23 May, 2018 20:37 IST|Sakshi
పశ్చిమగోదావరి జిల్లా పాదయాత్రలో వైఎస్‌ జగన్‌

సాక్షి, ఉంగుటూరు(పశ్చిమ గోదావరి జిల్లా) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 170వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. గురువారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గంలోని నైట్‌ క్యాంప్‌ శిబిరం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం ఉండి నియోజకవర్గంలోని ఆరేడు, ఉప్పులూరు క్రాస్‌ రోడ్డు మీదుగా కోలమూరు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. 

అనంతరం మధ్యాహ్నం 2.45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి పాములపర్రు, వెంకటరాజుపురం మీదుగా పెదకాపవరం వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి వైఎస్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర : జననేత వైఎస్‌ జగన్‌ పాదయ్రాత 169వరోజు ముగిసింది. బుధవారం 12.9 కిలోమీటర్ల దూరం నడిచారు. అగ్రహారపు గోపవరం, ముగ్గళ్ల క్రాస్‌, అర్ధవరం, వరదరాజుపురం, వెలగపల్లి, గొల్లదిబ్బ, గణపవరం మీదుగా సరిపల్లి వరకూ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 2,118.5 కిలోమీటర్లు నడిచారు.

మరిన్ని వార్తలు