జనం గుండెల్లో జగన్‌ పాదయాత్ర

8 Jan, 2019 13:25 IST|Sakshi
గత ఏడాది ఫిబ్రవరి 20న పొన్నలూరు మండలం మాలపాడులో పాదయాత్ర సందర్భంగా గంగిరెడ్డి మౌనిక కుమారుడికి రాజశేఖర్‌రెడ్డి అని నామకరణం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి

 ప్రజల హృదయానికి చేరువగా..

జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర ఆద్యంతం ఆసక్తికరం

మరువలేని తీపిగుర్తులు.. ఆత్మీయ మైలురాళ్లు

ఫిబ్రవరి 16న జిల్లాలో యాత్ర మొదలు

22 రోజులు 9 నియోజకవర్గాలో సాగిన జగన్‌ పాదయాత్ర

సాక్షి ప్రతినిధి,ఒంగోలు: వైఎస్సార్‌ర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో గత ఏడాది 22 రోజుల పాటు సాగించిన ప్రజాసంకల్ప యాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. జిల్లా వాసులకు ఎన్నో తీపుగుర్తులు మిగిల్చింది. మైలు రాళ్లను అధిగమించింది. అభిమాన నేత పాదయాత్ర వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపగా జగన్‌ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తారన్న భరోసా ప్రజలకు కలిగించింది. గత ఏడాది ఫిబ్రవరి 16న జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రకు పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి అడుగడుగున ఘన స్వాగతం లభించింది. ప్రజలు స్థానిక సమస్యలను జగన్‌ దృష్టికి తెచ్చారు. దివంగత నేత వైఎస్‌ పాలనలో జరిగిన మేలును జగన్‌కు గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో పడుతున్న కష్టాలను ఏకరువు పెట్టారు.  అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తానంటూ జగన్‌ జనానికి భరోసా ఇచ్చారు. జగన్‌ హామీలపై జనానికి నమ్మకం పెరిగింది.  జిల్లాలో జగన్‌ నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం నింపగా జనానికి భరోసా నిచ్చింది. మొత్తంగా ప్రజాసంకల్ప యాత్ర జిల్లాల వాసులకు మధురాను భూతులను మిగిల్చింది.

2018 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 12 వరకు 22 రోజులపాటు ఈ యాత్ర సాగింది. 9 నియోజకవర్గాల పరిధిలో 19  మండలాలు 124 గ్రామాల పరిధిలో 278.1 కి.మీ మేర జరిగిన యాత్ర ఎన్నో ఆసక్తికర విషయాలకు కేంద్ర బిందువయింది. లింగసముద్రం మండలంకొత్తపేట వద్ద ఈ యాత్ర ప్రారంభమైంది.
ఫిబ్రవరి 16వ తేదీన లింగసముద్రం మండలం రామకృష్ణాపురం వద్ద 1200 కి.మీ చేరుకుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ మొక్కను
నాటారు. వాకమళ్లవారిపాలెం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.
17న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కు చెందిన న్యాయవాదులు ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్న జగన్‌ ను కలసి తమ సంఘీభావం ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక న్యాయవాదులకు సంబందించిన 12 డిమాండ్ల పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు.
18న కాకుటారు వద్ద ప్రత్యేక హోదా కోసం తిరుపతి నుంచి ఢిల్లీకి సైకిల్‌ యాత్ర చేపట్టిన వెంకట్‌ జగన్‌ను కలసి మద్దతు ప్రకటించారు.
19న తుళ్లూరు మండలం కు చెందిన 29 గ్రామాల రైతులు రాజ«ధాని కి సంబంధించిన రైతులకు అండగా నిలవాలని జగన్‌ ను కోరారు.
20న పొన్నలూరు మండలం మాలపాడు కు చెందిన గంగిరెడ్డి.మౌనిక కుమారుడికి వైఎస్‌ జగన్‌ రాజశేఖరరెడ్డి గానామకరణం చేశారు.
21న మర్రిపూడి మండలం అగ్రహారాని చెందిన వెంకటేశ్వర్లు తన అమ్మ వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీగా పోటీ చేయడంతో తన తండ్రిని హత్య చేశారని జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.
22న కనిగిరి వద్ద పూణే లో ఉంటున్న మేకల శ్రీనివాసులు అతని మిత్రులు వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు.
24న కనిగిరి మండలం శంఖవరం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి సుజాత తన కుమార్తెకు జగన్‌తో విజయమ్మగా నామకరణం చేయించింది.
25న యర్రగొండపాలెం నియోజకవర్గ రైతులు పాదయాత్ర వద్ద కువచ్చి ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశారు.
26 న  మంచినీటి సమస్యకు పరిష్కారం చూపాలని జగన్‌ ఖాళీ బిందెలతో మహిళలతో కలసి నిరసన తెలిపారు.
అదేరోజు పొదిలి మండలం కాటూరిపాలేనికి చెందిన శ్రీకాంత్, భారతిలు తమ కుమార్తెకు విజయమ్మగా నామకరణం చేయించారు.
అదేరోజు పొదిలిలో నవరత్నాల శకటాలను ప్రదర్శించారు
28న చీమకుర్తి పోలీసు స్టేషన వద్ద పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా పైలాన్‌ ఆవిష్కరించారు. ఇక్కడే వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి మొక్కను నాటారు.
మార్చి 3న వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధుల ఢిల్లీ యాత్రకు తాళ్లూరుమండలం కొర్రపాటివారిపాలెం పచ్చజెండా ఊపారు.
4న రామనాధపురానికి చెందిన లక్ష్మమ్మ విజయమ్మకోసం తయారు చేసిన పార్టీ బ్యాగును జగన్‌కు అందచేశారు
5న నాగులపాడు వద్ద 1400 కి.మీ మైలురాయికి పాదయాత్ర చేరుకుంది. అక్కడ జగన్‌ రావిమొక్కను నాటి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అదే రోజు కొరిశపాడు మండలం పిచుకుల గుడిపాడుకు చెందిన గాదె సునీత తన కుమారుడికి రాజశేఖరరెడ్డి గా జగన్‌తో నామకరణం చేయించింది.
6న చంద్రబాబు వల్ల 780 కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నపడ్డాయని ఆయుష్‌ ఉద్యోగులు జగన్‌ను కలసి విన్నవించారు.
అదే రోజు ప్రసవాలకు ఆరోగ్య శ్రీవర్తింప చేయాలని పర్చూరుకు చెందిన భాస్కర్‌రెడ్డి వినతిపత్రం అందచేశారు. జగన్‌ చేస్తామని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు వారం క్రితం ఈ నిర్ణయం తీసుకున్నారు.
8 న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులతో కలసి కేక్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.
10 న దేవర కొండ సుబ్బులు టీడీపీ నాయకుల అరాచకానికి మరణించిందని  ఆమె కుమార్తె నాగలక్ష్మిజగన్‌ కలసి తెలియచేసింది.
11న చీరాలకు చెందిన ఇత్తడి లీల నూతన వస్త్రాలను జగన్‌కు బహూకరించింది.
అదే రోజు ఐయల్‌టీడీ భూముల కుంభకోణం, మత్యకారుల గుడిసెల తొలగింపుపై జగన్‌కు కలిసి వినతిపత్రం అందచేశారు.
12న చీరాల మండలం ఈపూరుపాలెం వద్ద పార్టీ ఆవిర్భావ  దినోత్సవం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేశారు.

మరిన్ని వార్తలు