చిలుక పలుకులపై ముందే హెచ్చరించిన వైఎస్‌ జగన్‌

23 May, 2019 12:30 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రీపోల్‌, ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల ఫలితాలను మించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ​ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 149 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ కేవలం 23 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన ఒక స్థానానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. లోక్‌సభ ఫలితాల్లో 25కి 24 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది.

ఎగ్జిట్‌ పోల్‌ సర్వే పేరుతో చంద్రబాబు ఆస్థాన చిలుకగా పేరొందిన లగడపాటి రాజగోపాల్‌ విడుదల చేసిన ఫలితాలు అసలు ఫలితాలకు కనీసం దరిదాపులకు కూడా సరితూగలేదు. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబునాయుడుతో కుమ్మకై లగడపాటిలాంటి దొంగ సర్వేలను ముందుకు తెస్తారని ఇంతకు ముందే వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతోందని ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఎన్నికలకు 36 గంటల ముందు లగడపాటి వచ్చాడని ఎన్నికల ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ చెప్పారు. లగడపాటి సర్వే చేస్తే దాన్ని ఎల్లో మీడియా నెత్తికేసుకుని మోసాయని తెలిపారు. ఆ తర్వాత తెలంగాణలో వచ్చిన ఫలితాలతో లగడపాటి సర్వే ఎలాంటిదో దేవుడు సినిమా చూపించాడని అన్నారు. వైఎస్‌ జగన్‌ చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుందంటూ సర్వే పేరుతో లగడపాటి చిలుక పలుకులు పలికిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు