పోలవరం పనులపై నిపుణుల ద్వారా ఆడిటింగ్‌..

20 Jun, 2019 15:57 IST|Sakshi

సాక్షి, పోలవరం: నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంపై పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు. పోలవరం పనులపై నిపుణుల కమిటీతో ఆడిటింగ్‌ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను చూడటంతో పాటు ఏరియల్‌ సర్వే ద్వారా ఆ ప్రాంతాన్నంతా పరిశీలించారు. ఆ తర్వాత ప్రాజెక్టు సమీపంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నిర్వాసితులకు పరిహారం పెంపు విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నాలుగు నెలల్లో ఏయే పనులు చేయగలరంటూ అధికారులను ముఖ్యమంత్రి ప‍్రశ్నించగా, స్పిన్‌ ఛానెల్‌ ఏటిగట్లను పటిష్టపరుస్తామని తెలిపారు. ఇక డ్యామ్‌ పూర‍్తయిన పది నెలలలోపు హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రికి తెలిపారు. 2021 ఫిబ్రవరి నాటికి ప్రధాన జలాశయాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 

చదవండిపోలవరం ప్రాజెక్టుపై వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణమేంటి?

కాగా అంతకు ముందు హెలికాప్ట‌ర్ ద్వారా ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించిన ముఖ్య‌మంత్రి..ఆ త‌రువాత క్షేత్ర‌స్థాయిలో ప్రాజెక్టును సంద‌ర్శించి ప‌నుల వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయినిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో స్వయంగా ప‌రిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలు మార్చే పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైయ‌స్ జగన్‌ టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.

 పునాదుల్లోనే పోలవరం ఎందుకు ఉంది?

2018 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయింది. 2018 నాటికి గ్రావిటీతో నీరు ఇస్తాం రాసుకోమంటూ అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అసెంబ్లీలో వెటకారంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ప్రాజెక్టు పూర్తి కాలేదు. నిర్వాసితులను పూర్తిస్తాయిలో తరలించి, ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు ఇవ్వగలిగితేనే ప్రాజెక్టు పూర్తయినట్లు. లక్షా ఐదు వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటి వరకూ మూడు వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు.

చదవండి: 
పోలవరంలో వైఎస్‌ జగన్‌
పోల‘వరం’... రాజన్నదే!
సీఎం జగన్‌ పోలవరం పర్యటన ఎందుకు? 

మరిన్ని వార్తలు