చరిత్ర పునరావృతం కాబోతుంది: నాగిరెడ్డి

2 Aug, 2019 16:02 IST|Sakshi

వైఎస్సార్‌ ఆశయాలే వైఎస్‌ జగన్‌ ఆలోచనలు

పోలవరం పూర్తి చేసేది వైఎస్‌ జగన్‌ మాత్రమే: నాగిరెడ్డి

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకి పునాదులు పడ్డాయని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో పోలవరానికి చేసింది ఏమీ లేదని విమర్మించారు. ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్సార్‌ అయితే.. దానిని పూర్తి చేసేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నాగిరెడ్డి మాట్లాడుతూ.. 2018లోనే పోలవరంను పూర్తి చేస్తామని టీడీపీ నేతలు గొప్పలు చెప్పారని, కానీ స్పీల్‌వే పనులు మాత్రమే పూర్తి చేశారని వివరించారు. ఎన్నికల కోసమే ప్రజలను బస్సుల్లో తీసుకెళ్లి ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. దోచుకునేందుకే కేంద్రం వద్ద నుంచి పోలవరంను టీడీపీ నాయకులు లాక్కున్నారని, నామినేటెడ్‌ పద్దతిలో టెండర్లు జరపడం వల్ల రూ.2300 కోట్లు అవినీతి జరిగిందని నాగిరెడ్డి ఆరోపించారు. 

సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘టెండర్లను రద్దు చేస్తే చంద్రబాబుకు ఉలుకెందుకు. పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. ఏపీకి పట్టిన శనివదిలింది కాబట్టే వర్షాలు పడుతున్నాయి. మరలా చరిత్ర పునరావృతం కాబోతుంది. కృష్ణా నది ప్రకాశం బ్యారేజీ దాటి సముద్రాన్ని చూడబోతుంది. 60 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. పట్టిసీమ నీళ్లు ఇస్తే ప్రజలు టీడీపీని ఎందుకు తిరస్కరించారు. ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూస్తే  23 కాస్తా  తగ్గుతాయి. రాజశేఖర్ రెడ్డి ఆశయాలే వైఎస్‌ జగన్‌ ఆలోచనలు’’ అన్నారు.

మరిన్ని వార్తలు