ప్రతి కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలి: వైఎస్ జగన్

19 Oct, 2014 19:01 IST|Sakshi

విజయనగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శిస్తున్నారు. విజయనగరం జిల్లా కోరుకోండలో దెబ్బతిన్ని మామాడి, టేకు, చెరుకు పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఇంత పెద్ద ఎత్తున విపత్తు జరిగినా ప్రభుత్వం ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్ జగన్ విమర్శించారు.

ఈ నెల పేదలకు ఉచితంగా ఇస్తామన్న బియ్యాన్ని ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు ప్రతి కుటుంబానికి తక్షణం 5 వేల రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పబ్లిసిటీ కోసం తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం, పూర్తిగా ధ్వంసమైన వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు రీ షెడ్యూల్ కూడా చేయలేదని, దీంతో పంటలు కోల్పోయిన రైతులకు బీమా వచ్చే అవకాశం లేదని జగన్ ఆరోపించారు.

మరిన్ని వార్తలు