ఇదీ జగన్ ఆరోగ్య పరిస్థితి...

30 Aug, 2013 02:35 IST|Sakshi

ఉస్మానియాలో డాక్టర్ అశోక్ కుమార్ నేతృత్వంలో జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు బీపీ 140/80 ఉంది. షుగర్ లెవెల్ 60 ఎంజీకి పడిపోయింది. జగన్‌కు ఆస్పత్రి మెడికో లీగల్ కేస్ (ఎంఎల్‌సీ) 23528 నంబర్‌ను కేటాయించారు. ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించగా జగన్ నిరాకరించారు. ఆయన కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన ఎన్‌ఐసీయూ 116వ నంబర్ గదిలో ఆయనకు ఈసీజీ పరీక్షలు చేశారు.

ఓపీ బిల్డింగ్‌లోని ఏఎంసీయూ 116 నెంబరు గదిలో జగన్‌కు చికిత్స అందిస్తున్నారు
బీపీ 140/80..  షుగర్ 60 ఎంజీకి పడిపోయింది.
పల్స్ రేటు 86గా నమోదైంది.
ఈసీజీలో స్వల్ప తేడాలున్నట్టు వైద్యులు తెలిపారు
ఎనిమిది మంది వైద్యుల బృందంతో చికిత్స
ఫ్లూయిడ్స్ తీసుకునేందుకు నిరాకరించిన జగన్. ‘నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష విరమించబోను. దయచేసి బలవంతం చేయొద్దు’ అని వైద్యులకు స్పష్టీకరణ.

మరిన్ని వార్తలు