అఖిలపక్ష భేటీకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

18 Jun, 2019 19:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం పార్లమెంట్‌లో జరగనున్న అన్ని పార్టీల అధినేతల సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. బుధవారం ఉదయం ఢిల్లీ వెళుతున్న వైఎస్‌ జగన్‌ మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్‌ లైబ్రరీ బిల్డింగ్‌లో జరిగే  ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో కేటీఆర్‌ ఈ సమావేశానికి హాజరవుతారు.

దేశంలోని అన్ని చట్ట సభలకు (పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీలకు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, 2022లో 75వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఈ ఏడాది జరిగే మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని ఆయా పార్టీల అధినేతలకు రాసిన లేఖలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషి పేర్కొన్నారు.  టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్‌ చంద్రబాబునాయుడును కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ మంత్రి ప్రహ్లాద జోషికి లేఖ రాశారు.

మరిన్ని వార్తలు