పటేల్‌కు వైఎస్ జగన్ నివాళులు

31 Oct, 2016 11:07 IST|Sakshi
పటేల్‌కు వైఎస్ జగన్ నివాళులు

హైదరాబాద్: ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ సమైక్య దినోత్సవాన్ని పురస్కరించుకొని లోటస్ పాండ్లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, శ్రీనివాస వేణుగోపాల క్రిష్ణలతోపాటూ పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు