జన హృదిలో.. ప్రతి మదిలో వైఎస్సార్‌

2 Sep, 2018 08:28 IST|Sakshi

పశ్చిమపై వల్లమాలిన ప్రేమ

తొమ్మిదేళ్లయినా చెక్కుచెదరని ప్రజాభిమానం

అభివృద్ధిపై ఆయనది చెరగని సంతకం. 
పేదల బతుకుల్లో వెలుగుల చిరుదివ్వె.
అనారోగ్య పీడితులకు ఓ భరోసా.
విద్యార్థుల ఉన్నత చదువులకు ఓ నమ్మకం.
ప్రతి మదిలోను, ప్రతి ఎదలోనూ ఒకే నామస్మరణ అదే వైఎస్సార్‌.  


సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రతి కుటుంబం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఏదో విధంగా లబ్ధి పొందింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, సొంత ఇల్లు ఇలా అన్నిరకాలుగా లబ్ధి పొందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. డెల్టా, మెట్ట, ఏజెన్సీ ఏ ప్రాంతం అయినా ఆయన వల్ల వరాలు పొందని కుటుంబాలు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆ మహానేత మరణించి నేటికి తొమ్మిదేళ్లు అయినా ఆయన తమ గుండెల నిండా ఉన్నాడని అయన వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు నేటికీ గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నాయి. వైఎస్సార్‌ పశ్చిమ గోదావరి జిల్లాపై వల్లమాలిన ప్రేమ చూపించేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి పర్యటన పశ్చిమ నుంచే ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చారు.  జిల్లాలో పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం, తాడిపూడి ఎత్తిపోతల, డెల్టా ఆధునికీకరణ, ఏటిగట్ల పటిష్టత ఇలా ఆయన చేపట్టని ప్రాజెక్టు లేదు. 

ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లిన పథకాలు
కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలోని ఒక పేద కుటుంబంలో పుట్టిన సోమరాజు వైఎస్‌ తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా త్రిపుల్‌ ఐటీ ద్వారా ఉన్నత చదువులు చదివి టెక్‌మహేంద్రా వంటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇలా ఉన్నత చదువులు అందని ద్రాక్షలా ఉన్న కుటుంబాల నుంచి వేల సంఖ్యలో యువతీయువకులు ఉన్నతస్థానాలకు ఎదగడానికి వైఎస్‌ చేపట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దోహదం చేసింది. అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ ఉన్నత విద్యను ఉచితంగా అందించేందుకు సమున్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చింది. వైఎస్‌ మరణానంతరం పేదలకు ఫీజు కష్టాలు మొదలయ్యాయి.

అందరి బంధువయ
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు జబ్బుచేస్తే డబ్బులెలా అనేది వారి ఆలోచన.  గుండె జబ్బు సోకి అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉండే గిరిజన కుటుంబాలకు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం అపర సంజీవనిగా మారింది. ఇది ఏజెన్సీ ప్రాంతంలో వందల సంఖ్యలో గిరిజనుల ప్రాణాలు కాపాడింది. ఇలా ఏ గుండెను కదిపినా వైఎస్‌ నామస్మరణే. వైఎస్‌ తన హయాంలో ఏ వర్గానికి చెందిన ప్రజలను కూడా విస్మరించకుండా అందరికీ అవసరమయ్యే పథకాలతో వారి గుండెల్లో నిలిచిపోయారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నేడు ఆరోగ్యశ్రీ పేరు మార్చినా సకాలంలో అనుమతులు ఇవ్వకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 104 పథకం మూలనపడింది.

జలయజ్ఞ ప్రదాత 
జలయజ్ఞంలో భాగంగా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఆయన హయాంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమాలు ఒకదానితో ఒకటి పోటీపడి పరుగులు తీశాయి. నిత్యం పోలవరం కోసం తపించారు. డెల్టాను ఆధునికీకరించడం ద్వారా ఆయకట్టు స్థిరీకరణ జరగాలని భావించారు. రైతన్నకు భరోసా అందించారు. గుండె గుండెలో గూడు కట్టుకున్నారు. మెట్ట ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. పోలవరం కాల్వలు ఆయన సమయంలోనే పూర్తికాగా, ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమతులను ఆయనే తీసుకువచ్చారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లలో ప్రాజెక్టు నత్తనడకన సాగుతున్న సంగతి తెలిసిందే.  

పోలవరం గ్రామానికి వరద ప్రమాదం లేకుండా రూ.6 కోట్లతో నెక్లెస్‌ బండ్,  పోలవరం నియోజకవర్గంలోని ముంపు జలాలను గోదావరి నదిలోకి మళ్ళించడానికి రూ. 57 కోట్లతో కొవ్వాడ అవుట్‌ ఫాల్‌ స్లూయిజ్, పాలకొల్లు నియోజకవర్గంలో  యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ. 20 కోట్లతో రివిట్‌మెంట్‌ కోసం వైఎస్‌ తీసుకున్న చొరవ కారణంగా ఆ ప్రాంత ప్రజలు ముంపు బారి నుంచి బయట పడగలిగారు. ఏలూరు ప్రజలకు దుఖఃదాయినిగా ఉన్న తమ్మిలేరు వరదల నుంచి జిల్లా కేంద్ర ప్రజలకు విముక్తి కల్పించారు. 2005లో వరదలు వచ్చినప్పుడు స్వయంగా వచ్చి పరిశీలించిన వైఎస్‌ ఇక్కడి నుంచి వెళ్లకముందే మొదటి దశ పనులకు రూ.17 కోట్లు మంజూరు చేశారు. సుమారు రూ.90కోట్ల నిధులు మంజూరు చేసి ఆయా ప్రాంతాల్లో ఏటిగట్లను పటిష్టం చేసి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపించారు. ఇటీవల వచ్చిన భారీ వరదలకు కూడా ఏలూరు తట్టుకుని నిలబడటం కూడా వైఎస్‌ చొరవే. రైతుల మోములో చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో ఉచిత విద్యుత్‌ అందించడమే కాకుండా ఒకే దఫాలో రైతులకు రుణ మాఫీ చేసిన రైతు బాంధవుడిగా అందరూ వైఎస్‌ను గుర్తు చేసుకుంటున్నారు.  

పేదల సాధికారిత కోసం 
పేదరిక నిర్మూలనే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్తశుద్ధితో ఎనలేని కృషి చేశారు. అయితే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి వైఎస్సార్‌ చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. కూలీలుగా ఉన్న వారికి భూములు ఇచ్చి ఆ భూముల్లో మోటార్‌లు వేయించడంతో పాటు వాటికి విద్యుత్‌ కనెక్షన్‌లు ఏర్పాటు చేసి, వాటికి ఉచిత కరెంట్‌ ఇచ్చి కూలీలను రైతులుగా మార్చిన ఘనత వైస్సార్‌దే. జిల్లాలో అర్హులైన నిరుపేదలకు 30 వేల ఎకరాల భూపంపిణీ చేయడంతో ఆ నిరుపేద రైతులు రాజశేఖరరెడ్డిని నేటికీ దేవుడిగా కొలుచుకుంటున్నారు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా యువతకు విద్యావకాశాలు కల్పించి తద్వారా ఉద్యోగావకాశాలు పొందేలా వైఎస్‌ తీసుకున్న చొరవ ఇప్పటికీ ఆయన తీపిగురుతుగా నిలిచి ఉంది. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించి వారి కుటుంబాల్లో వెలుగు నింపారు. ఇప్పటి ప్రభుత్వం రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను డిఫాల్టర్లుగా మార్చింది. అందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు తపన పడ్డారు కాబట్టే  వైఎస్సార్‌ అందరి గుండెల్లొ గూడుకట్టుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ధన్యవాదాలు సీఎం సార్‌

యురేనియం బాధితులకు ఊరట

సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టేందుకు నిరాకరణ!

హోదా కోసం కదం తొక్కిన యువత

వలలో వరాల మూట

‘రూ. 5 కోట్ల పనిని రూ. 137 కోట్లకు పెంచారు’

తప్పిన ప్రమాదం; విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..!

బాలశాస్త్రవేత్తలకు రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం

ప్రభుత్వ శాఖలే శాపం

'ఉదయ్‌'రాగం వినిపించబోతుంది

ఒంటరిగా వెళుతున్న మహిళలే లక్ష్యంగా..

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

క్యాంపస్‌ ఉద్యోగాల పేరిట పని చేయించుకుని..

మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం

అమర్‌ ప్రసంగం అదుర్స్‌

గంగవరంలో చిరుత సంచారం?

జగన్ సీఎం అయ్యాడని శ్రీశైలానికి పాదయాత్ర

విలాసాలకు కేరాఫ్‌ ప్రభుత్వ కార్యాలయాలు

నారికేళం...గం‘ధర’ గోళం

మార్పునకు కట్టుబడి..

మోడీ పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకున్నారు

బంకుల్లో నిలువు దోపిడీ.!

కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

ముస్లిం మైనార్టీలకు ఏకైక శత్రువు కాంగ్రెస్సే

అరెస్ట్‌ చేశారు.. చార్జిషీట్‌ మరిచారు

నగదు వసూలు చేస్తే జైలుకే

ఎంపికైతే ఏం చేస్తారు?

గ్యాస్‌ అయిపోయిందని భోజనం వండని సిబ్బంది

రాజాంలో దొంగల హల్‌చల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం