మరపురాని మహానేత

3 Sep, 2018 08:35 IST|Sakshi
నాయుడుపేట: పిచ్చిరెడ్డితోపు వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ 
నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలు, అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భౌతికంగా వైఎస్సార్‌ దూరమైనా ఎల్లప్పుడూ తమ గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని పేర్కొన్నారు. ఆయన ఎప్పటికీ మరపురాని మహానేతగా నిలిచిపోతారన్నారు. జోహార్‌ వైఎస్సార్‌ అంటూ నినాదాలు చేశారు. 

నెల్లూరు(సెంట్రల్‌) : కావలిలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌ మరణించి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఎన్నటికీ మరచిపోలేనివని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దామన్నారు.

సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సూళ్లూరుపేట పట్టణం, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌ హయాంలో ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

  • వెంకటగిరిలో జెడ్పీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. బొమ్మిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయసాధనకు కృషి చేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉందామన్నారు.
  • కోవూరు, బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించిన వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ చూపి న అడుగుజాడల్లో నడుద్దామన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కలసి పనిచేద్దామన్నారు.
  • ఉదయగిరి నియోజకవర్గంలోని నిర్వహించిన వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు.
  • గూడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ లాంటి ప్రజాసంక్షేమ పాలన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు.
  • నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి  విగ్రహానికి నగర డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన   మాట్లాడుతూ మహానేత రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.  వైఎస్సార్‌కు గుర్తుగా జగనన్నకు తోడుగా ఉందామన్నారు. మహానేత మన మధ్య లేక పోయినా ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మరవలేమన్నారు.
  • ఆత్మకూరు పట్టణంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని వైఎస్సార్‌ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.
  • సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో స్థానిక వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు.
  • నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని కరెంటు ఆఫీçసు సెంటర్‌లో స్థానిక నేతల ఆధ్వర్యంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యులు, నేతల ఆధ్వర్యంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు.     
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రాజధానిలో దోపిడీ చేశారు.. రాజధాని నిర్మించలేదు’

అయేషా హత్య కేసు : సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ను కౌగిలించుకుంటే తప్పనిపించడం లేదా?

చంద్రబాబుకు భయం పట్టుకుంది

సిట్‌ సహాయ నిరాకరణపై కోర్టు ఆగ్రహం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అర్థవంతంగా కాకుండా.. అర్దాంతరంగా ముగించేస్తాడు’

అభిమాని కుటుంబానికి అండ‌గా యంగ్‌ హీరో!

హ్యాట్రిక్‌ హిట్‌కు రెడీ అవుతున్న హీరో, డైరెక్టర్‌!

వరుస సినిమాలతో స్టార్ హీరో సందడి

నేనూ రాజ్‌పుత్‌నే..

వైరముత్తుపై యువ రచయిత సంచలన ఆరోపణలు!