ప్రతి ఇంటా వైఎ‘స్మరామి’

8 Jul, 2018 12:42 IST|Sakshi

జిల్లాపై వైఎస్సార్‌ది చెరగని ముద్ర

ప్రతి ఇంటి తలుపునూ తట్టిన సంక్షేమం

పారిశ్రామిక ప్రగతికి శ్రీసిటీతో తొలి అడుగు 

జిల్లావ్యాప్తంగా నేడు మహానేత జయంతి వేడుకలు

మట్టిని ప్రేమించిన వాడు మనిషిని ప్రేమిస్తాడు. జాతిహితం కోరేవాడు జననేత అవుతాడు. మహానేతగా నీరాజనాలందుకుంటాడు. జనం గుండెల్లో ఎప్పటికీ వెలిగిపోతుంటాడు. అలాంటి నాయకుడే వైఎస్‌ రాజశేఖర రెడ్డి. ప్రజల గుండెల్లో ఆయనది చెరపలేని సంతకం. గుండె చిల్లును పూడ్చి పు#నర్జన్మ ప్రసాదించిన ఆత్మీయ నేతకు ప్రతి హృదయం నీరాజనాలు పలుకుతుంది. బడుగు ఇంటి తలుపు తడితే గూడునిచ్చిన జననేతకు నివాళులర్పిస్తుంది. పింఛనుతోæ క్షుద్బాధ తీర్చుకుంటున్న పండుటాకు ప్రతి అన్నం మెతుకులోనూ ఆయన్నే చూస్తోంది. ఫీజు రాయితీతో  ఎదిగిన సరస్వతీ పుత్రులు నీ రుణం తీర్చుకోలేమంటూ వైఎస్‌ను కీర్తిస్తున్నారు. మహానేత జయంతి సందర్భంగా ఆయన పాలనను జిల్లా ప్రజానీకం మననం చేసుకుంటోంది.  

చిత్తూరు, సాక్షి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్ని ఆదివారం నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి.   వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయిదేళ్ల పాలనలో మహానేత జిల్లాకు ఒనగూర్చిన ప్రయోజనాలను జనం గుర్తు చేసుకుంటున్నారు. ఆయనే ఉండిఉంటే హంద్రీనీవా పూర్తయి జిల్లాభూముల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కేవని చర్చించుకుంటున్నారు. వైఎస్‌∙చిత్తూరు జిల్లాపై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించేవారు.. ఆయన అడుగు జాడలు,  చేపట్టిన పథకాల ఫలాలు జిల్లా ప్రజల మదిలో చెరిగిపోని తీపి గుర్తులుగా ఉన్నాయి. 

శ్రీసిటీకి శ్రీకారం..
చిత్తూరు జిల్లా పారిశ్రామికీకరణకు అనుగుణంగా ఉంటుందని రాజశేఖర రెడ్డి ఎప్పుడూ చెబుతుండేవారు. పక్క జిల్లానే కావడంతో ముఖ్యమంత్రి కాక ముందు 30 సంవత్సరాల నుంచే చిత్తూరు ప్రజలతో పరిచయాలుండేవి. దీంతో ఇక్కడి ప్రజలకు ఏం కావాలో క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఆయనకు దొరికింది. జిల్లాకు నీటి కష్టాలు ఉన్నాయని తెలిసి ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచి తెలుగుగంగకు నీటి కొరత లేకుండా చేశారాయన. తెలుగుగంగ రావడంతో జిల్లా పారిశ్రామికంగా పరుగులు తీస్తోంది. వైఎస్‌ హయాంలోనే దేశానికే తలమానికమైన శ్రీసిటీ సెజ్‌ జిల్లాలో ఏర్పడింది. ఈ సెజ్‌ వల్ల సుమారు 50వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రపంచంలోనే పేరెన్నికగల కంపెనీలన్నీ ఇందులో కొలువుదీరుతున్నాయి. మన్నవరంలో భెల్‌కు అంకురార్పణ పడింది వైఎస్‌ హయామే.

షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించారు..
జిల్లా చెరకుకు పెట్టింది పేరు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్టరీ మూతపడింది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రూ.50 కోట్లు కేటాయించి ఫ్యాక్టరీని తెరిపించారు. ఆయన మరణం తర్వాత టీడీపీ పాలనలో అది మళ్లీ మూతపడింది. దీంతో జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణమే తగ్గిపోయింది. ఎవరైనా ఆయన దగ్గరకు సహాయం కోసం వెళితే కాదనే ప్రసక్తే లేదని ఆయన స్నేహితులు చెబుతున్నారు. ఎస్వీ యూని వర్సిటీలో వైద్య విద్యనభ్యసించారు. జిల్లాలో స్నేహితులకు కూడా కొదవలేదు. తిరుపతిలో స్కూటర్లో చెక్కర్లు కొట్టేవారమని ఆయన స్నేహితుడు జొన్నకురుకుల ప్రతాప్‌రెడ్డి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

 ఎస్వీయూలో హౌస్‌సర్జన్‌ చేసేటప్పుడు ఆ కళాశాలలో ఈశ్వర్‌రెడ్డి అనే ఉద్యోగి పనిచేసేవారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈశ్వర్‌రెడ్డి ఏదో పని నిమిత్తం తటపటాయిస్తూనే వెళ్లారు. ఎలాంటి సహాయ మూ అడగకుండా వెనక్కి వస్తుంటే.. ‘ఈశ్వరన్నా నాతో ఏదైనా పనుందా.. అడగకుండా ఎందుకు వెళుతున్నావ్‌’ అని అడిగి పనిచేసిపెట్టారని ఈశ్వర్‌రెడ్డి కళ్ల నుంచి రాలుతున్న నీళ్లను తుడుచుకుంటూ చెప్పారు. విద్యార్థి దశలో కూడా ఎంతో మందికి సహాయం చేసేవారని స్నేహితులు చెబుతున్నారు. చిత్తూరు నుంచి రాయచోటి మీదుగా పులివెందులకు బైక్‌లో వెళ్లేవారమని రాజశేఖర రెడ్డి స్నేహితులు గుర్తుచేసుకున్నారు.

జిల్లాకు వస్తుండగా..
రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ప్రజలకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో రచ్చబండ కార్యక్రమాన్ని రూపొందించారు. దీన్ని చిత్తూరు రూరల్‌ మండలం అనుంపల్లిలోనే ప్రారంభించాలని సంకల్పిం చారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే అనుకోని విషాదం జరిగింది. ఆయన వస్తున్న హెలికాఫ్టర్‌ కూలిపోవడంతో రాష్ట్ర ప్రజలకు కోలుకోలేని దెబ్బతగిలింది. పేదల అపద్బాంధవుడు మరలిరాని లోకాలకేగిపోయాడు. 

ఆయనుంటే గాలేరు–నగరి పూర్తయ్యేది
పుత్తూరు: గాలేరు–నగరి సాధనే లక్ష్యంగా మాజీ మంత్రి చెంగారెడ్డి 2003లో పాదయాత్ర చేశారు. అప్పటి ప్రతి పక్ష నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుత్తూరులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పుడు పుత్తూరు సర్పంచ్‌గా ఉన్నాను. మధ్యాహ్న భోజనం మా ఇంట్లో ఏర్పాటు చేశాను. గాలేరు–నగరి ఆవశ్యకత, దానివల్ల మా ప్రాంతా నికి కలిగే ప్రయోజనాన్ని వివరించారు. పుత్తూరు అప్పుడే పట్టణంగా ఎదుగుతోంది. పట్టణ వాసులకు తాగునీటి అవసరాలకు కూడా గాలేరు–నగరి ప్రాజెక్ట్‌ చాలా ముఖ్యమైంది. తప్పకుండా నెరవేరుస్తామని వైఎస్‌ మాకు హామీ ఇచ్చారు. 2004లో అధికారంలోకి రాగానే వైఎస్‌ ప్రారంభించిన జలయజ్ఞంలో గాలేరు–నగరి ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా జరిగాయి. భూసేకరణ జరిగి నిర్వాసితులకు నష్టం పరిహా రం కూడా అందింది. కాలువలు పూర్తయ్యాయి. వైఎస్‌ మరో ఐదేళ్లు బతికి ఉంటే గాలేరు–నగరి పూర్తయ్యేది. మా దురదృష్టం ఆయన లేరు. తర్వాత వచ్చిన సీఎంలు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గాలేరు–నగరి ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని ఆశిస్తున్నాను.
– డీఎన్‌ ఏలుమలై, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుత్తూరు

వైఎస్సార్‌ నాకు     పునర్జన్మ ఇచ్చారు
కుప్పం రూరల్‌: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాకు పునర్జన్మ ఇచ్చారు. గుండె జబ్బు రావడంతో చికిత్స కోసం తిరుపతి, బెంగళూరు నగరాల్లో ఆసుపత్రులకు వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా మూడునెలల్లో ఆపరేషన్‌ చేయకపోతే కష్టమని వైద్యులు చెప్పారు. నాకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ ఉన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుం బం మాది. ఆపరేషన్‌ చేసుకోవాలంటే రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఏమి చేయాలో తెలియక మదనపడుతున్న నాకు ఆరోగ్య శ్రీ గురించి చెప్పారు. వెంటనే ఆరోగ్య శ్రీ పథకంలో నమోదు చేసుకున్నాను. నెల రోజుల్లో నెల్లూరు నారాయణలో ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్, మందులు, బస్సు చార్జీలతో ఉచితంగా భోజన వసతి కల్పించారు. ఆపరేషన్‌ చేయించుకుని తొమ్మిదేళ్లయింది. ఆరో గ్యంగా ఉన్నాను. వ్యవసాయ పనులు, కూరలు అమ్ముకుని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను. నా జీవితం మహానేత పెట్టిన భిక్ష.
      – సేటు, గుల్లేపల్లి, కుప్పం మండలం

మరిన్ని వార్తలు