నీదే స్ఫూర్తి.. నీవే కీర్తి

8 Jul, 2019 08:27 IST|Sakshi
జేకేగుమ్మడలో నిర్మించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆలయం

కన్నీటి బతుకుల్లో చిరునవ్వుల పువ్వులు విరబూయించిన జన వనమాలి అతడు. ఉరకలెత్తే వరద నీటిని పొలంబాట పట్టించిన ప్రజా భగీరథుడూ అతడే. ఆగిపోతున్న గుండెలకు ఊపిరి పోసిన వైద్యుడు ఆ మనిషి. సాగు కష్టాలకు తెర దించి రైతు మరణాలను ఆపిన ఆప్తుడు ఆ మనీషి. చందమామ కథల్లో కథానాయకుడిలా.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చారు. జనం మద్దతుతో అఖండ విజయం సాధించారు. చరిత్ర ఎరుగని పాలనను చవి చూపించారు. నాయకులకు మార్గదర్శకులయ్యారు. సామాన్యులకు కుటుంబ సభ్యుడిగా మారారు. ఇక సెలవు అంటూ జ్ఞాపకాలను వదిలి వెళ్లిపోయారు. ఆ యుగ పురుషుని పేరు యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి. చరిత్ర మర్చిపోలేని పేరు. జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన పేరు. జయంతి నాడు ఆయన జయాలను పరిశీలిస్తే..  

సాక్షి, శ్రీకాకుళం : పీజీ చేయాలంటే వైజాగ్‌ వెళ్లాలి. దూర విద్య అయినా పాట్లు తప్పవు. 2008 ముందు వరకు జిల్లా విద్యార్థుల పరిస్థితి ఇది. అలాం టి జిల్లాలోనే ఓ యూనివర్సిటీ ఏర్పా టు చేసి ఉన్నత విద్యను అందరికీ చేరువ చేసిన ఘనత వైఎస్‌కు మా త్రమే దక్కుతుంది. జిల్లాకు ఎంతో కీలకమైన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వ విద్యాలయం 2008 జూన్‌ 25న ఏర్పాటైంది. 1978 నుంచి జిల్లాకు యూనివర్సిటీ కావాలని పోరాటాలు, ఉద్యమాలు నడిచాయి. కానీ ఎవ్వరూ వినిపించుకోలేదు. హామీలే తప్ప పనులు చేయలేదు. వైఎస్సార్‌ మాత్రమే ఆ నినాదాల వెనుక ఆర్థ్రతను వినగలిగారు. ప్రస్తుతం వర్సిటీలో 25 కోర్సులు, 21 విభాగాలు ఉన్నాయి. ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి సదుపాయం కూడా కల్పించడంతో ఎక్కువ మంది విద్యావంతులయ్యారని వర్సిటీ పూర్వపు ఇన్‌చార్జి వీసీ మిర్యాల చంద్రయ్య తెలిపారు. 

తొలి ఆపరేషన్‌ నాదే..
వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నాకు ప్రాణభిక్ష పెట్టింది. 2005లో నాకు జరిగిన గుండె ఆపరేషన్‌ ఉమ్మడి రాష్ట్రాల్లో మొదటిది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన నేను 1983 నుంచి టీడీపీ అభిమానిని. గత టీడీపీ హయాంలో పాలకొండ పట్టణం 12వ వార్డు జన్మభూమి కమిటీ సభ్యునిగా చేశాను. పార్టీపరంగా టీడీపీ అయినా ఆ మహానుభావుడు అందించిన పథకంతోనే నేను కుటుంబ సభ్యుల మధ్య తిరుగుతున్నాను. 2005లో నా గుండెలో రక్తనాళాలు మూసుకుపోవటంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాను. ముగ్గురు పిల్లల భవిష్యత్‌ తలచుకుని కుమిలిపోయేవాడిని. అలాంటిది రూ.40వేల ఖర్చుతో కూడిన గుండె ఆపరేషన్‌ పూర్తి ఉచితంగా జరిగింది. ఏడాది కాలం ఉచితంగా మందులు, వైద్యపరమైన పరీక్షలు జరిగాయి. ఆపరేషన్‌ జరిగిన ఏడాది కాలంలో వైఎస్‌ తన యోగక్షేమాలు తెలపాలని ఉత్తరం కూడా రాశారు.   
– ఆనంద్‌ చౌదరి, పాలకొండ

మహానేత.. ‘ఉన్నత’ ఆలోచనల కలబోత
ఎచ్చెర్ల క్యాంపస్‌: పీజీ చేయాలంటే వైజాగ్‌ వెళ్లాలి. దూర విద్య అయినా పాట్లు తప్పవు. 2008 ముందు వరకు జిల్లా విద్యార్థుల పరిస్థితి ఇది. అలాం టి జిల్లాలోనే ఓ యూనివర్సిటీ ఏర్పా టు చేసి ఉన్నత విద్యను అందరికీ చేరువ చేసిన ఘనత వైఎస్‌కు మా త్రమే దక్కుతుంది. జిల్లాకు ఎంతో కీలకమైన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వ విద్యాలయం 2008 జూన్‌ 25న ఏర్పాటైంది. 1978 నుంచి జిల్లాకు యూనివర్సిటీ కావాలని పోరాటాలు, ఉద్యమాలు నడిచాయి. కానీ ఎవ్వరూ వినిపించుకోలేదు. హామీలే తప్ప పనులు చేయలేదు. వైఎస్సార్‌ మాత్రమే ఆ నినాదాల వెనుక ఆర్థ్రతను వినగలిగారు. ప్రస్తుతం వర్సిటీలో 25 కోర్సులు, 21 విభాగాలు ఉన్నాయి. ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి సదుపాయం కూడా కల్పించడంతో ఎక్కువ మంది విద్యావంతులయ్యారని వర్సిటీ పూర్వపు ఇన్‌చార్జి వీసీ మిర్యాల చంద్రయ్య తెలిపారు. 

వంగర మండలంలో వీవీఆర్‌పేట పంచాయతీ జేకే గుమ్మడ గ్రామంలో ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి గుడిని నిర్మించారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ గ్రామంలోని అర్హులందరికీ 400 మందికి ఫించన్లు రావడంతో పాటు 350 మందికి పక్కా ఇళ్లు వచ్చాయి. అంతేకాకుండా గ్రామంలో ప్రజలు అందరికీ ఉపాధి పధకం ద్వారా రోజువారీ వేతనాలు అందడంతో వలసలు తగ్గుముఖం పట్టాయి. వైఎస్‌ మరణానంతరం 2010లో ఆలయ నిర్మాణం చేపట్టారు. మాజీ సర్పంచ్‌లు మరిశర్ల తవిటినాయుడు, మరిశర్ల విజయలక్ష్మిలు ఆలయ నిర్మాణానికి స్థలా న్ని దానం చేయగా ఇక్కడ ప్రజలంతా ఉపాధి హామీ పనులు, ఇటుకలు పనులు, వ్యవసాయ పనులు చేసి వచ్చిన కూలీ డబ్బులను విరాళంగా సేకరించుకొని పెద్దాయనకు గుడికట్టి గుండెల్లో పదిలపరుచుకున్నారు.  

మొదటి విగ్రహం ఇక్కడే..
జలుమూరు: రాజన్న పథకాలతో లబ్ధి పొందిన వారెవరూ ఆయను అంత తొందరగా మర్చిపోలేరని అంటున్నారు జోనంకి పంచాయతి గంగాధరపేట,అబ్బాయిపేట గ్రామస్తులు. మహానేత మృతి చెందిన 11 రోజు లకు వారు కర్మకాండలు నిర్వహించి అనంతరం పంచా యతీ కార్యాలయం సొంత నిధులతో విగ్రహం ఏర్పాటు చేశారు. పూజారి సింహాచలం ఆధ్వర్యంలో సనపల సిం హాచలం తదితర పెద్దలు, గ్రామస్తులు ఆర్థిక సహకారంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను కూడా ఆహ్వానించారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్సార్‌ వర్ధంతి, జయంతి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.


రాష్ట్రంలోనే ఇది మొదటి విగ్రహమని స్థానికులు చెబుతున్నారు.

ప్రజల మనసెరిగిన నేత
రైతు కుటుంబం వచ్చిన నాయకుడు రైతులాగే ఆలోచిస్తాడు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్‌ రాజశేఖర రెడ్డి. అపారమైన వనరులు ఉన్నా వలస వెళ్తే గానీ బతుకు గడవని స్థితి సిక్కోలుది. వైఎస్సార్‌ పాదయాత్ర చేసేంత వరకు సిక్కోలులో వనరుల గు రించి పట్టించుకున్న నాథుడే లేడు. ఆయన గద్దెనెక్కాకే సిక్కోలులో పొలాలకు మంచి రోజులు వచ్చాయి. స్థానిక నేత ధర్మాన ప్రసాదరావు సూచనలతో వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన జలయజ్ఞం జిల్లా తలరాతను మార్చే దిశగా సాగింది. వంశధార ఫేజ్‌–2, స్టేజ్‌–2 పనులను జలయజ్ఞంలో భాగంగా 2008లో వంశధార 933.90 కోట్ల నిధులతో మొదలుపెట్టారు. సుమారుగా 30 మండలాల్లో  2,30,510 ఎకరాలకు  అదనంగా సాగు అందించేందుకు పనులు చేశారు.

మహేంద్ర తనయపై ఆఫ్‌షోర్‌ నిర్మాణానికి రూ.123.25 కోట్లతో 2007లో రూపకల్ప న చేశారు. దీని వల్ల 24,600 ఎకరాలకు సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమస్యలకు పరిష్కారం చేయవచ్చిన ఆలోచించారు. అలాగే గొర్లె శ్రీరాములునాయుడు మడ్డువలస జలాశయం స్టేజ్‌–1 పనులు జనవరి 2009లో రూ.57.87కోట్లతో మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టుతో 12500 ఎకరాలు సాగవుతోంది. ముంపు సమస్యను పరిష్కరించడానికి నాగావళి, వంశధార వెంబడి కరకట్టలు నిర్మించడానికి పూనుకున్నారు. వంశధార కరకట్టల పనులను మూడు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ–1ను 2007 లో అగ్రిమెంట్‌ విలువ రూ.44.77కోట్లుతో, ప్యా కేజీ–2ను రూ. 2729లక్షలతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ప్యాకేజీ–3 అగ్రిమెంట్‌ విలువ రూ.4916 లక్షలుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పనులు వేగవంతమవుతున్న సమయానికి అందరినీ విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వైఎస్‌ స్థాయిలో ఈ పనులపై పర్యవేక్షణ చూపిన నాయకుడిని సిక్కోలు చూడలేకపోయింది.  

అడ్డుగోడలు దాటుకుని..
హిరమండలం, ఎల్‌ఎన్‌ పేట: వంశధార ప్రాజెక్టు.. వై ఎస్‌ రాజశేఖర రెడ్డి కలల ప్రాజెక్టు. సముద్రంలోకి పో తున్న నీటిని పొలంబాట పట్టించేందుకు ఒడిశాతో స హా ఎంతో మందిని మొండిగా ఎదుర్కొని మొదలుపె ట్టిన ప్రాజెక్టు ఇది. జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులు ఉన్నా సద్వినియోగం అంతంతమాత్రమే. జిల్లాకు ఒక్క గొట్టా బ్యారేజీనే నీరే దిక్కు. ఈ పరిస్థితుల్లో వంశధార నదీ జలాలను ఒడిసి పట్టుకునేందుకు వంశధార ఫేజ్‌–2 రిజర్వాయర్‌ నిర్మాణానికి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. 2005 ఫిబ్రవరి 25న జీవో 33 జారీచేశారు. పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రాజెక్టు నిర్మాణానికి తొలి విడతగా రూ.900 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించారు.

ఒడిశాతో జల కలహాలను కూడా త న చతురతతో సమసిపోయేలా చేశారు. జలవనరుల శాఖ నిపుణుల సలహాతో మొండిగా ముందుకు సాగా రు. అదే ఇప్పుడు సత్ఫలితాన్నిచ్చింది. ట్రిబ్యునల్‌ అనుకూల తీర్పునకు కారణమైంది. భామిని మండలం కాంట్రగడ్డ వద్ద సైడ్‌ వీయర్‌ నిర్మించి, అక్కడ నుంచి 34 కిలోమీటర్ల మేర వరద కాలువలు నిర్మించతలపెట్టారు. ఇలా కాలువల ద్వారా వచ్చిన నీరు సింగిడి–పారాపురం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లలో చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. దీనిద్వారా భామిని, కొత్తూరు మండలాల్లో దాదాపు 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 

అక్కడ నుంచి హిరమండలం ఫేజ్‌–2 రిజర్వాయర్‌లోకి నీరు చేరనుంది. 19.05 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్‌ హెడ్‌స్లూయిస్‌ నుంచి ప్రత్యేక కాలువల ద్వారా గొట్టా బ్యారేజీ కుడి, ఎడమ కాలువలకు అనుసంధానించాలన్నది నా టి యోచన. అవసరమైతే భారీ కాలువలు తవ్వించి జిల్లాలో సాగునీటి ఇబ్బందులున్న మండలాలకు వంశధార మిగులు జలాలు పంపించాలని మహానేత కలలుగన్నారు. నాడు ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే నేడు మహా ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వచ్చే మహా భాగ్యం కలుగనుంది. కానీ ఆయన మరణం ఈ పనులకు శాపంగా మారుతోంది. నిర్వాసితులను కూడా కష్టాలు వెన్నాడుతున్నాయి.  ఏ అర్ధరాత్రో యాక్సిడెంట్‌ అయితే విశాఖ వెళ్లాలి. ఏ అపరాత్రికో ప్రాణం మీదకు వచ్చినా వైజాగ్‌ పరుగెత్తాలి. రిమ్స్‌ వచ్చాక ఆ కష్టాలు కాస్తయినా తగ్గాయి. పాదయాత్ర సమయంలో సిక్కోలు గుండెచప్పుడు విన్న వైఎస్‌ ఆర్‌ జిల్లాకు చేసిన మహోన్నత సాయం రిమ్స్‌ ఏర్పాటు.

అడగకుండానే ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేశారు. కళాశాలతోపాటు అప్పటికే ఉన్న జిల్లా కేంద్ర ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేశారు. మూడు వందల పడకల ఆస్పత్రిని ఐదు వందల పడకల పెద్దాస్పత్రిగా, కళాశాలకు అనుబంధం చేస్తూ, మెరుగైన సేవలు అందాలన్న ఉద్దేశంతో కళాశాలను మంజూరు చేసి, జిల్లా వాసుల గుండెల్లో నిలిచిపోయారు. ఈ కళాశాల నిర్మాణానికి అప్పడే  రూ.119 కోట్లు మంజూరు చేశారు. ఆయన అధికారంలో ఉండగానే ఈ కళాశాలను ప్రారంభించి, అన్ని వసతులు కల్పించే దిశగా అభివృద్ధి చేశారు. ఈ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన 2008 జనవరి రెండో తేదీన చేశారు. అక్కడ నుంచి కేవలం ఒక ఏడాదిలోనే కళాశాలను ప్రారంభించి, తరగతులను ప్రారంభించారు. దీంతో జిల్లాలో వైద్యవిద్యను అందించడంతో పాటుగా, రోగులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఆయన జిల్లావాసుల ఆరోగ్యానికి పునాది వేశారు.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జాక్‌పాట్‌ దగా..!

దారుణం: బాలిక దారుణ హత్య

కమలంలో కలహాలు... కామ్రేడ్‌ల కుమ్ములాటలు... 

‘ఆత్మా’ కింద ఏపీకి ఐదేళ్లలో రూ.92 కోట్లు 

జీవో 5 ప్రకారమే ఏపీపీఎస్సీ ఎంపికలు 

పంచాయతీలకే అధికారాలు.. సచివాలయాల్లోనే నిర్ణయాలు

టెండర్లకు ‘న్యాయ’ పరీక్ష 

రివర్స్‌ టెండరింగ్‌లో 15 నుంచి 20 శాతం మిగులు

పోలవరం పూర్తి చేసే సత్తా మాకే ఉంది

నాపై బురద జల్లుతున్నారు

ప్రతిభావంతులకే కొలువు

విద్యుత్‌ కొనుగోళ్లలో అంతులేని అవినీతి

మహిళా సాధికారత దిశగా కీలక ముందడుగు

ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌గా చల్లా మధుసూధన్‌

23న బెజవాడకు గవర్నర్‌ విశ్వభూషణ్‌

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి డా. దనేటి శ్రీధర్‌ విరాళం

ఈనాటి ముఖ్యాంశాలు

ఆత్మా పథకం కింద ఏపీకి రూ. 92 కోట్లు

బీసీలకు ఏపీ సర్కార్‌ బంపర్‌ బొనాంజా

పృథ్వీరాజ్‌కు కీలక పదవి!

‘అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగు ఇది’

చంద్రబాబుని నిండా ముంచిన లోకేష్‌..

ముఖ్యమంత్రి హామీ నిజం చేస్తా! : వీసీ

వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

ప్రతిపక్షం తీరు కుక్కతోక వంకరే: సీఎం జగన్

‘షరతులకు లోబడి లేకపోతే చర్యలు’

నెలల చిన్నారి వైద్యానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌

‘అప్పటి నుంచి మైండ్‌ మరింత దెబ్బతిన్నట్టుంది’

నాలుగు రోజుల్లోనే రెట్టించిన ఉత్సాహంతో

కిక్కుదిగుతోంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష