వైఎస్‌ వివేకానందరెడ్డికి కుటుంబ సభ్యుల నివాళి

8 Aug, 2019 09:05 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : దివంగత నేత, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. పులివెందులలోని ఘాట్‌ వద్దకు చేరుకున్న వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, వివేకా కుమార్తె సునీతమ్మ, ఇతర కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు. రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి సహా ఇతర ప్రముఖులు వైఎస్‌ వివేకానందరెడ్డికి నివాళులు అర్పించారు. ఇక అజాతశత్రువుగా పేరు పొందిన వైఎస్ వివేకానందరెడ్డి జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒక మంచి మనిషి అకాల మరణం చెందారంటూ ఆయనను గుర్తుచేసుకుని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన ముద్ర కడప రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అభిమానులు పేర్కొంటున్నారు.

కాగా వైఎస్‌ వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణ, పులివెందుల అభివృద్ధిపై అధికారులు, నాయకులతో సమీక్ష నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పులివెందులకు రావాల్సి ఉండగా.. పర్యటన వాయిదా పడిన విషయం విదితమే. సీఎం ఢిల్లీ పర్యటన పొడగింపు నేపథ్యంలో పులివెందుల పర్యటన వాయిదా పడినట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు