ఏపీని అగ్రస్థానంలో నిలిపారు

20 Jun, 2020 05:19 IST|Sakshi
‘ప్రతిదినం ప్రజాహితం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ

వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ 

ఏడాదిలోనే 90 శాతం హామీలు అమలు

ప్రతిదినం.. ప్రజాహితం బుక్‌ ఆవిష్కరణ

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీని అన్నింటా అగ్రస్థానంలో నిలిపారని, 90 శాతం హామీలను ఏడాదిలోనే అమలు చేశారని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పేర్కొన్నారు. 2019 మే నుంచి 2020 మే 31 వరకు సీఎం వైఎస్‌ జగన్‌ రోజువారీ అధికారిక కార్యక్రమాలతో సమాచార పౌర సంబంధాల శాఖ డివిజనల్‌ పీఆర్వో పాలెపు రాజశేఖర్‌ ‘ప్రతిదినం.. ప్రజాహితం’ పుస్తకాన్ని రూపొందించగా.. ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్‌ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు కార్యాలయం ప్రచురించింది. ఆ పుస్తకాన్ని హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైఎస్‌ విజయమ్మ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు జూలై 8న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో 6 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ప్రాజెక్ట్‌ల నిర్మాణం వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. సీఎం చేపట్టే ప్రజా సంక్షేమ పథకాలు, శాఖల వారీగా చేసిన సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు తదితర అంశాలను విషయ సూచికలా తెలియజేసే తొలి సంవత్సర నివేదికగా ఈ పుస్తకాన్ని ముద్రించామని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ తెలిపారు. పుస్తక రచయిత పాలెపు రాజశేఖర్‌ను వైఎస్‌ విజయమ్మ, దేవులపల్లి అమర్‌ అభినందించారు.

మరిన్ని వార్తలు