ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు..

8 Jul, 2019 10:07 IST|Sakshi

సాక్షి, అమరావతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం మహానేత 70వ జయంతిని పురస్కరించుకుని నాయకులు, అభిమానులు పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. సోమవారం ఉదయం రాజన్న తనయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. అలాగే రైతు బాంధవుడు,  వైఎస్సార్‌ జయంతి సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించనుంది.

మరోవైపు ప్రతి పల్లెలోను మహానేతను స్మరించుకుంటూ ప్రజలు, అభిమానులు, నాయకులు ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా తమకు జరిగిన మేలును తలచుకుంటున్నారు. తమ గుండెల్లో పదిలంగా నిలిచిపోయిన ఆ మహానేత పుట్టిన రోజు తమకు పండుగ రోజేనని చెబుతున్నారు.


వైఎస్సార్‌ జయంతి వేడుకలు...

విజయనగరం : జిల్లాలోని చీపురుపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, బొత్స ఝాన్సీ, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. 

కృష్ణా : గుడివాడలో మంత్రి కొడాలి నాని మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతే రాజు అని నమ్మి పాలన సాగించిన ఏకైక ముఖ్యమంత్రి మహానేత వైఎస్సార్‌ అని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. 

  • వత్సవాయి మండలం భీమవరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను మహానేతకు నివాళులర్పించారు. అనంతరం 70 కేజీల భారీ కేక్‌ను కట్‌ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి, వెంకటరెడ్డి, రంగారెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
  • దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని పెడనలోని బంటుమిల్లి రోడ్డు, బైపాస్‌ రోడ్డులలో ఉన్న ఆయన విగ్రహాలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 
  • అవనిగడ్డ ఎమ్మెల్యే సింహద్రి రమేశ్‌ స్థానిక వంతెన సెంటర్‌లోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. అవనిగడ్డ హైస్కూల్‌లో పిల్లలకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కడవకోల్లు నరసింహారావు, సింహద్రి వెంకటేశ్వరరావు, రేపల్లి శ్రీనివాసరావు, పెద్ద ఎత్తున్న కార్యకర్తలు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి : జిల్లాలోని కొవ్వూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

తూ​ర్పు గోదావరి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. ప్రత్తిపాడు మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

  • జగ్గంపేట మండలం వెంగయమ్మపురం సెంటర్‌లో మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వికలాంగులకు, వితంతువులకు పెన్షన్‌ అందజేశారు.
  • జగన్నాథపురం 23వ డివిజన్‌లో మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే  ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ మేయర్‌ సుంకర పావని, ఫ్లోర్‌ లీడర్‌ చంద్రకళ దీప్తి, కార్పొరేటర్లు మీసాల శ్రీదేవి, కిషోర్‌ కుమార్‌, మీసాల ఉదయ్‌, పెద్ద ఎత్తున వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి : జిల్లాలోని పోడూరు మండలం కవిటంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పాల్గొన్నారు. 

గుంటూరు : తాడేపల్లిలోని క్రిస్టియన్‌ పేటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ప్రకాశం : జిల్లాలోని ఎర్రగొండపాలెం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

గుంటూరు : బాపట్ల మండలం నరసాయపాలెంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నూతన విగ్రహాన్ని డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి అవిష్కరించారు. అనంతరం మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కర్నూలు : ఆలూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మహానేత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లాలోని ఆత్మకూరులో వైయస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

కర్నూలు : నల్లకాల్వ సమీపంలోని వైఎస్సార్‌ స్మృతివనం వద్ద ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రూ. 30 కోట్లతో వైఎస్సార్‌ స్మృతివనాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

విశాఖపట్నం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను పాడేరు అంబేడ్కర్‌ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టగూలీ భాగ్యలక్ష్మి మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌ రాయవరంలలో నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్దులకు పింఛన్లు, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, బోలిశెట్టి గోవింద్‌, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ : జిల్లాలో కమలాపురం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి, ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. 

  • రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలోని పాత మార్కెట్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లువెంకటరెడ్డి కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్‌ కట్‌ చేశారు. 

కర్నూలు : పత్తికొండ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మహానేతకు నివాళులర్పించారు. అనంతరం వెల్దుర్తి మండలం అల్లుగుండులో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. 

తూర్పు గోదావరి : అమలాపురం నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  పినిపే విశ్వరూప్ మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనపర్తి కెనాల్ రోడ్డులోని మహానేత విగ్రహానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మహానేత విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి : తణుకు నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇరగవరం మండలంలో మహానేత విగ్రహానికి ఎమ్మెల్యే కారుమూరి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • భీమవరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పార్టీ నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వీఆర్‌ దాస్‌, ఏఎస్‌ రాజు, మేడిద జాన్సన్‌, గూడూరి ఉమాబాల, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
  • ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

నెల్లూరు : జిల్లాలోని సూళ్లూరుపేటలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలవేటి సంజీవయ్య మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కట్టా సుధాకర్‌రెడి​, షేక్‌ రఫీ, కట్టా రమణారెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతపురం : సోమందేపల్లిలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌.. వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

కర్నూలు : ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల కూడలిలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుంగుల బిజేంద్రారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పేషెంట్లకు బ్రెడ్‌, పండ్లు అందజేశారు.

ప్రకాశం : జిల్లాలోని సంతనూతలపాడు మండలంలో దివంగత మహానేత వైస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతపురం : కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌ దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముదిగల్లులో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను ప్రారంభించారు. 

కృష్ణా : జిల్లాలోని తోట్లవల్లూరులో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పామర్రు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 

నెల్లూరు : వెంకటగిరిలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆయన విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దొంతు శారదా, ఢిల్లీ బాబు, నెమళ్లపూడి సురేశ్‌రెడ్డి, నక్క వెంకటేశ్వర్లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతపురం : జిల్లాలోని ధర్మవరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మహానేత విగ్రహాలనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

కర్నూలు : జిల్లాలోని చాగలమర్రిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి విప్‌ గుంగుల ప్రభాకర్‌రెడ్డి మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకాశం : ఒంగోలులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి  మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

కృష్ణా : జిల్లాలోని ఏ కొడూరు మండలం చీమలపాడులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని కొక్కిలిగడ్డ రక్షణనిధి అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భూక్యా ఘనీయ, నరెడ్ల వీరారెడ్డి, జి సాంబయ్య, బి నాగక్రిష్ణ, జి వెంకట్రావు, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. 

అనంతపురం : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70 జయంతి సందర్భంగా జిల్లాలోని బత్తలపల్లిలో ఆయన చిత్రపటానికి ఆశావర్కర్లు పాలాభిషేకం చేశారు.

నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్‌లోని మహానేత విగ్రహానికి మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారీగా పార్టీ నాయకులు, అభిమానులు  పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి : జిల్లాలోని మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మహానేత విగ్రహాన్ని అవిష్కరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు. 

కర్నూలు : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ సర్కిల్‌లో మహానేత విగ్రహానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం : దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలను మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్‌, కన్వీనర్లు మళ్లా విజయప్రసాద్‌, కేకే రాజు, ఇతర సీనియర్‌ నేతలు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు పార్క్‌ హోటల్‌ జంక్షన్‌లో కూడా వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు.

చిత్తూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని నారాయణవనంలోని ఆయన విగ్రహానికి సత్యవేడు ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహానేత విగ్రహానికి పాలాభిషేకం చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బీరేంద్ర రాజు, జేబీఆర్‌, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.   

చిత్తూరు : దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని నగరంలోని సెంట్రల్‌ బ్యాంకు, జిల్లా పరిషత్‌ కార్యాలయం, కలెక్టరేట్‌ సర్కిల్‌ వద్ద గల ఆయన విగ్రహాలకు చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ సర్కిల్‌లో కేక్‌కట్‌ చేశారు. ఈ కార్యక్రమలో వైఎస్సార్‌సీపీ నాయకులు బుల్లెట్‌ సురేశ్‌, ఆర్‌ చంద్రశేఖర్‌, కృష్ణారెడ్డి, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.

విజయవాడ : విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ ఇంచార్జి పీవీపీ, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్‌ మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తంబళ్లపల్లి(చిత్తూరు) : కురబలకోట మండలం అంగళ్లులో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి మహానేత విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

తూర్పు గోదావరి : జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం గ్రామంలో దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డయాలసిస్‌ చేయాల్సిన ఓ వ్యక్తికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పదివేల రూపాయల పింఛను అందజేశారు.

విశాఖపట్నం : నర్సీపట్నంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. 

శ్రీకాకుళం : జిల్లాలోని రణస్థలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

తూర్పు గోదావరి : రాజమండ్రిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ నాయకులు రౌతు సూర్యప్రకాశ్‌రావు, కౌరు శ్రీనివాస్‌, బొమ్మన రాజ్‌కుమార్‌, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. 

ఖమ్మం : పాలేరు నియోజవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌  రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మహానేతకు నివాళులర్పించారు.

శ్రీకాకుళం : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆమదాలవలసలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

  • జిల్లాలోని పెద్దపాడులో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్‌ విగ్రహాన్ని అవిష్కరించారు. అనంతరం మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 
  • పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు.
  • పలాసలో ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
  • పోలాకిలో మంత్రి ధర్మాన కృష్ణ దాస్‌ దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 
  • టెక్కలిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, నాయకులు పేరాడ తిలక్‌, దువ్వాడ శ్రీనివాస్‌ మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రకాశం : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్‌ యాదవ్‌ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. 

నల్గొండ : జిల్లాలోని నకిరేకల్‌ నియోజవర్గంలో మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇరుగు సునీల్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఆయన గుర్తుచేశారు.

అనంతపురం : జిల్లాలోని గుంతకల్లు మండలం కసారపురంలో దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను ప్రారంభించారు. 

ప్రకాశం : జిల్లాలోని కందుకూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్‌రెడ్డి, ఇతర నాయకులు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని రామతీర్థం సమ్మర్ స్టోరేజ్ పక్కన ఉన్న వరాల సాయినగర్లో పేదలకు గతంలో ఇచ్చిన నివేశిత పట్టాలకు మహిధర్‌రెడ్డి స్థలాలు పంపిణీ చేశారు.

నెల్లూరు : మహానేత వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని గుడూరు మండలం గొల్లపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. 

కర్నూలు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను శరీన్‌ నగర్‌లో ఘనంగా నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి  మహానేత విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్లురు మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో కాటసాని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. 

ప్రకాశం : మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలను దర్శిలోని గడియార స్తంభం సెంటర్‌, రెడ్డి కాంప్లెక్స్‌లలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయవాడ : వైఎస్సార్‌సీసీ రాష్ట్ర కార్యాలయంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం అభిమానుల సమక్షంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నాయకులు గౌతంరెడ్డి, సోమినాయుడు, సుజాత, రత్నబిందు, జానారెడ్డి, తోట శ్రీనివాస్‌, కాలే పుల్లారావు కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా  వైఎస్సార్‌ సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. వైఎస్సార్‌ ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ భౌతికంగా మన మధ్య లేకపోయిన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన నాయకుడు వైఎస్సార్‌ అని గుర్తుచేశారు.

తిరుపతి : నగరంలో మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆటో నగర్‌లో పింఛన్లు పంపిణీ చేశారు.

ప్రకాశం : జిల్లాలోని కొండేపి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ డాక్టర్‌ వెంకయ్య ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడులకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు.

విశాఖ : మహానేత వైఎస్సార్‌ 70వ జయంతి వేడుకలను గాజువాక పెదగంట్యాడ, కాకతీయ జంక్షన్‌లలో ఘనంగా నిర్వహించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ఘనంగా సన్మానం చేశారు. పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దొడ్డి రమణ, మంత్రి రాజశేర్‌, పరదేశి, వెంపాడ అప్పారావు, తుంపాల తాతారావు, మంజుల, పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

చిత్తూరు : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే బాబు మొగిలీస్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్‌ కుమార్‌రాజా, నాయకులు సురేశ్‌ రెడ్డి, పురుషోత్తం, ప్రవీణ్‌రెడ్డి, దొరస్వామి, పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సిద్దిపేట : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీసీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌ గుప్తా కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత పేద ప్రజలకు చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు