బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్ఆర్ సీపీ

21 Jun, 2014 11:58 IST|Sakshi
బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్ఆర్ సీపీ

హైదరాబాద్ : శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశాన్ని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. బీఏసీలో సముచిత ప్రాధాన్యత కల్పించేవరకూ తాము బీఏసీ సమావేశాలకు హాజరు అయ్యేది లేదని ఆపార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు స్పష్టం చేశారు. సభా సంప్రదాయాలను అధికార పక్షం తుంగలోకి తొక్కిందని ఆయన మండిపడ్డారు.

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సదుద్దేశంతో సహకరిస్తున్నా... అధికార పక్షంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం ఇద్దరికే అవకాశం కల్పిస్తామంటూ మొండి వైఖరి అలవంభిస్తున్నారని జ్యోతుల నెహ్రు ధ్వజమెత్తారు. గతంలో పాటించిన సాంప్రదాయాలనే ఇప్పుడు కూడా పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు