జగన్‌ ప్రచారం... వైఎస్సార్‌సీపీ జయకేతనం 

24 May, 2019 03:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ ప్రచారం వైఎస్సార్‌సీపీకి అఖండ విజయం అందించింది. ఆయన ఎన్నికల సభలు నిర్వహించిన నియోజకవర్గాల్లో 88 శాతం స్థానాల్లో పార్టీ విజయఢంకా మోగించడం ఇందుకు నిదర్శనం. జాతీయ స్థాయిలోనూ ఇది అందరి దృష్టి ఆకర్షిస్తోంది.  ప్రచారంలో భాగంగా వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఫిబ్రవరి 6న తిరుపతిలో సమర శంఖారావం సభతో శ్రీకారం చుట్టారు. ఏప్రిల్‌ 9 వరకు 13 జిల్లాల్లో 73 సభల్లో పాల్గొన్నారు. రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొనడం విశేషం. ఏప్రిల్‌ 9న గుంటూరు, తిరుపతిలలో సభలతో ఈ పర్వాన్ని ముగించారు. ఆయన ప్రచారం చేసిన 73 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 64 చోట్ల ఘన విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మొత్తమ్మీద తిరుపతి, కడప, అనంతపురం, ఏలూరు, నెల్లూరు, కాకినాడ, నర్సీపట్నం, నెల్లిమర్ల, పి.గన్నవరం, పాణ్యం, రాయదుర్గం, రాయచోటి, పోలవరం, అవనిగడ్డ, వేమూరు, కావలి, పలమనేరు, పులివెందుల, పలాస, పాడేరు, పిఠాపురం, చిలకలూరిపేట, తిరువూరు, ఆదోని, తాడిపత్రి, మదనపల్లె, పార్వతీపురం, పాయకరావుపేట, ముమ్మడివరం, చింతలపూడి, వినుకొండ, నందిగామ, సంతనూతలపాడు, బద్వేల్, మైదుకూరు, నగరి, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, మడకశిర, పెనుకొండ, గూడరు, గిద్దలూరు, దర్శి, శృంగవరపుకోట, పెందుర్తి, భీమవరం, సత్తెనపల్లి, గురజాల, ఒంగోలు, మైలవరం, నెల్లూరు, నంద్యాల, కల్యాణదుర్గం, జమ్మలమడుగు, విజయవాడ సెంట్రల్, రాజానగరం, అనకాపల్లి, గాజువాక, మచిలీపట్నం, ఏలూరు, కాకినాడ రూరల్, మంగళగిరి, కర్నూలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నెగ్గింది.

మరిన్ని వార్తలు