సీమలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహర దీక్షలు

2 Oct, 2013 11:48 IST|Sakshi

రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరవధిక దీక్షలు చేపట్టింది. తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు చేపట్టిన నిరవధిక దీక్ష ఈ రోజు ఉదయం తుడా సర్కిల్లో ప్రారంభమైంది. అదే జిల్లాలోని పుంగనూరులో ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లిలో ఎమ్మెల్సీ డి.తిప్పారెడ్డి, బి.కొత్తకోటలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తిరుపతిలోని ఎస్వీయూలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక ప్రాంతీయ సదస్సు నిర్వహించనుంది. ఆ సదస్సుకు రాయలసీమ జిల్లా ప్రతినిధులు, జస్టిస్ లక్ష్మణరెడ్డి, ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి, మాజీ వైస్ చాన్సలర్ గోపాల్రెడ్డి తదితరులు పాల్గొనున్నారు.

 

అలాగే వైఎస్ఆర్ జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా పోరుమామిళ్లలో డీసీ గోవిందరెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాదరెడ్డి,మైదుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎస్.రఘురామరెడ్డి ఆధ్వరంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షలకు భారీగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తులు తరలివచ్చారు.

 

అలాగే జిల్లాలోని 36 గంటల పాటు నిరవధిక దీక్షను ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఈ రోజు ఉదయం ప్రారంభించారు. వారి దీక్షకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మద్దతు ప్రకటించారు. తెలుగుత తల్లి గుండెకోతకు నిరనసగా రాయచోటులో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమైక్య దీక్ష చేపట్టారు.

మరిన్ని వార్తలు