రాజంపేటలో ఉక్కు మహాధర్నా ప్రారంభం

25 Jun, 2018 11:16 IST|Sakshi

సాక్షి, రాజంపేట : కడప ఉక్కు- రాయలసీమ హక్కు అనే నినాదం జిల్లాలో హోరెత్తుతోంది. గ్రామాల్లో ప్రచార సభలు మొదలుకొని పార్టీ సమావేశం , సంతకాల సేకరణ, రిలే దీక్షలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాజంపేట కేంద్రంగా వైఎస్సార్‌సీపీ నేతలు పోరుబాట పట్టారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలంటూ రాజంపేట కూడళ్లలో వైఎస్సార్‌పీపీ  నేతలు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఉక్కు పరిశ్రమ కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన మహధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు అంటూ నినదించారు. మాజీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, ఎమ్మల్సీ గోపాల్‌ రెడ్డి, రాజంపేల పార్లమెంట్‌ అద్యక్షుడు అమర్నాథ్‌ రెడ్డి, పార్టీ ఇతర నాయకులు సమన్వయ కర్తలు మహాధర్నాలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు