సమైక్యవాదులంతా వైఎస్సార్ సీపీవైపే

10 Feb, 2014 03:19 IST|Sakshi
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని కోరుకునే వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. స్థానిక మున్సిపల్  హైస్కూల్ మైదానంలో ఆదివారం సిక్కోలు తిరుగుబాటు పేరిట ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎంపీగా పార్లమెంట్‌లో సమైక్యరాష్ట్రం కోరుతూ ప్లకార్డులు ప్రద రించిన నాటి నుంచి నేటి వరకు మాట మార్చని నేత జగనేనని అన్నారు. అందువల్లనే ఎందరో నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. 
 
 పార్టీ రాష్ట్ర సార్వత్రిక విభాగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌చందర్ మాట్లాడుతూ తెలుగుజాతి ఐక్యతను కాంక్షిస్తున్న నాయకుడు జగన్‌నేనని, అందువల్లనే ఆయనను చూస్తే కాంగ్రెస్, టీడీపీలకు దడ అని పేర్కొన్నారు. ప్రజలంతా నా కోసం కాకుండా, రాష్ట్రం కోసం, మీ కోసం, మీ పిల్లల కోసం పోరాడాలంటూ కరుణామయుడు తరహాలో అన్నప్పుడు ప్రజలు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు.  జెడ్పీ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం మాట్లాడుతూ సమైక్యం కోరుకొనే వారంతా ఐక్యం  కావాలని పిలుపునిచ్చారు. వారికి జగన్ నాయకత్వంలోని వైఎ స్సార్ సీపీ దశ, దిశా నిర్దేశం చేసి అండగా నిలుస్తుం దని చెప్పారు.      
 
 అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి బేబినాయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల నాయకులు, కొన్ని మీడియాలు పార్టీ బలం తగ్గుతుందని అనడంలో వాస్తవం లేదనడానికి ఇటువంటి సభలే నిదర్శనమన్నారు. ప్రజలు అబద్దపు ప్రచారాలను నమ్మే అమాయకులు కాదని తప్పుడు ప్రచారమాధ్యమాలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.  పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎం.వి.కృష్ణారావు మాట్లాడుతూ ప్రజల కోసమే పనిచేసే కుటుం బం వైఎస్సార్ కుటుంబమని చెప్పారు. అటువంటి వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.  పార్టీ మున్సిపల్ పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ మాటకు కట్టుబడే వంశం వైఎస్సార్‌ది అని, ఆ కుటుంబం నుంచి వచ్చిన జగన్ అదేబాటలో నడుస్తున్నారని గుర్తు చేశారు. 
 
 పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు మాట్లాడుతూ శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా కాదని ఉపేక్షించబడిన జిల్లా అని, దానిని వైఎస్సార్ విశేషంగా అభివృద్ధి చేశారన్నారు. సిద్ధాంతాల కోసం పనిచేసే జగన్‌కు గౌరవించాలన్నారు. చంద్రబాబుది మూడు నాల్కల ధోరణి అని దుయ్యబట్టారు. ధర్మాన కూడా సిద్ధాంతాల కోసం పనిచేసే వ్యక్తి అని, సంస్కారం ఉన్న వారంతా వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని.. అటువంటి సభకు తిరుగుబాటు సభ అని కాకుండా సంస్కార సభ అని నామకరణం చేస్తే బాగుండేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ  పార్లమెం టరీ నియోజ కవర్గ సమన్వయకర్త పిరియా సాయి రాజ్,  కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, పీఎంజె బాబు, కిల్లి రామ్మోహ నరావు, బొడ్డేపల్లి మాధురి,  మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్యే పి.రాజన్నదొర, కలమట మోహ నరావు, మినతి గొమాంగో, నియోజకవర్గ సమన్వ యకర్తలు తమ్మినేని సీతారాం,  వరుదు కళ్యాణి, వై.వి సూర్యనారాయణ,
 
దువ్వాడ శ్రీనివాస్, వజ్జ బాబూ రావు, విశ్వసరాయ కళావతి, పాలవలస విక్రాంత్, కలమట వెంకటరమణ, గొర్లె కిరణ్ కుమార్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షు డు హనుమంతు కిరణ్,  పార్టీ మహిళా విభాగం అధ్యక్షు రాలు బల్లాడ హేహమాలి నీరెడ్డి, పార్టీ నాయ కులు  కడబండి శ్రీనివాసరావు, కొత్తపల్లి గీత, రవి రాజ్, పాలవలస ఇందుమతి,  డాక్టర్ పైడి మహేశ్వ రరావు, గేదెల పురుషోత్తం, బొడ్డేపల్లి పద్మజ,  చల్లా రవి, ధర్మాన ఉదయ్ భాస్కర్, ఎం.వి పద్మావతి, అంధవ రపు వరహానర్శింహం, అంధవరపు సూరి బాబు, అల్లు జోగినాయుడు, కొమరాపు తిరు పతిరావు, ప్రధాన రాజేంద్ర, పేరాడ తిలక్, బల్లాడ జనార్ధనరెడ్డి,  కూన మంగమ్మ, కోత మురళీ, టి. కామేశ్వరి, జెఎం శ్రీనివాస్, పైడి రాజారావు,  ఎన్ని ధనుంజయ్,  మూ కళ్ల సుగుణ, టి. మోహిని,  చల్లా అలివేలు మంగ, చల్లా మంజుల, గుంట జ్యోతి, గురుగుబిల్లి లోకనాధం, మామిడి శ్రీకాంత్, కోణార్క్ శ్రీనివాస్, నర్తు నరేం ద్రయాదవ్, మండవిల్లి రవి, ఎంవి స్వరూప్, ధర్మాన రామ్‌మ నోహరనాయుడు, వి.చిన్నరాం నాయుడు, దుంగ సుధాకర్, ధర్మాన రామలిం గంనాయుడు, ధర్మాన రాందాస్, కరిమి రాజేశ్వర రావు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
పింఛన్ రూ.700 చెల్లిస్తాం...
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: పాలకొండ రోడ్డులో మహాబైక్ ర్యాలీ సాగుతున్న సమయంలో దళితవాడ వృద్ధులు పలువురు జగన్‌వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకున్నారు. పింఛన్ సొమ్ము ఎంత అందుతుందని జగన్ వృద్ధులను ప్రశ్నించగా రూ.200 వస్తుందని సమాధానమిచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రూ.700 పింఛన్ అందజేస్తామని చెప్పడంతో వృద్ధులంతా సంతోషించారు. అదే సమయంలో ఓ వృద్ధుడు అక్కడకు చేరుకుని దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో తనకు ఆరోగ్యశ్రీ పథకంలో జరిగిన బైపాస్ సర్జరీ వివరాలను వెల్లడించారు. 
 
పార్ట్‌టైం ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయండి
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సుమారు 12,271 మంది ఆర్ట్స్, క్రాఫ్ట్స్, పీఈటీ పార్టుటైం ఉపాధ్యాయుల సర్వీసును క్రమబద్ధీకరిం చాలని ఆ సంఘ ప్రతిని ధులు గంగు వెంకటరమణమూర్తి, సీహెచ్ శ్రీనివాసరావు, బూరవెల్లి ఉగాది తదితరులు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సమైక్య శంఖారావం సభకు జిల్లాకు విచ్చేసిన జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు ఉద్యోగులను  దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎన్నో సందర్భాల్లో  ఆదుకున్న పరిస్థితులను ఈ సందర్భంగా జగన్‌కు వివరించారు. దీనిపై ప్రభుత్వం వస్తే తగుచర్యలు చేపడతామని జగన్ హామీనిచ్చారు. 
 
 
మరిన్ని వార్తలు