అరకు ప్రాంతంపై ప్రభుత్వానికి రహస్య అజెండా ?

5 Sep, 2014 12:05 IST|Sakshi
అరకు ప్రాంతంపై ప్రభుత్వానికి రహస్య అజెండా ?

హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంపై టీడీపీ ప్రభుత్వానికి రహస్య అజెండా ఉన్నట్లుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాల కోసం ఆ ప్రాంతాన్ని డీ నోటిఫై చేస్తారేమోనని వారు అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్ సీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజన్నదొర, సర్వేశ్వర్‌రావు, గిద్ది ఈశ్వరి, కళావతి, పుష్ప శ్రీవాణి, రాజేశ్వరి మాట్లాడుతూ... ఇప్పటికీ గిరిజన సలహామండలి పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని వారు గుర్తు చేశారు.

గిరిజన సంబంధిత అంశాల్లో ప్రభుత్వం... ఎస్టీ ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  గిరిజన ప్రాంతం అరకును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వకపోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. గిరిజన అంశాలు సభలో చర్చకు వచ్చినప్పుడు స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు