హోదా పోరు.. హోరెత్తిన ఏపీ

8 Apr, 2018 16:16 IST|Sakshi
విజయవాడలో వంటావార్పు కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు వెల్లువెత్తుతోంది. ఎంపీల​ దీక్షకు సంఘీభావం ప్రకటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు, వంటావార్పు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అంటూ నినదించారు. రాష్టానికి హోదా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కృష్ణాజిల్లా

  • నందిగామ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి మెండితోక జగన్ మోహన్‌రావు ఆధ్వర్యంలో  కృష్ణానదిలో జల దీక్ష
  • నందిగామ గాంధీసెంటర్‌లో రిలే నిరాహార దీక్షలు
  • కంచికచర్ల లో 65వ నంబర్ జాతీయ రహదారిపై వంట వార్పూ కార్యక్రమం
  • విజయవాడ భవానీపురంలో వంటావార్పు కార్యక్రమం
  • నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో రెండవ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు
  • గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో 2వ రోజు రిలేదీక్షలు, వంటావార్పు కార్యక్రమం

విశాఖపట్నం జిల్లా

  • పాడేరు అంబేద్కర్ కూడలి వద్ద రెండవ రోజూ కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహారదీక్షలు
  • అరకులో నియోజక కన్వీనర్ చెట్టిఫాల్గుణ ఆధ్వర్యంలో రెండవ రోజూ కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు
  • ఇసుక తోట వద్ద వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త వంశీకృష్ణ ఆధ్వర్యంలో వంటావార్పు

తూర్పుగోదావరి జిల్లా

  • కాకినాడ రూరల్ కరపలో రెండవ రోజు కొనసాగుతున్న వైఎస్సార్‌ సీపీ రిలే నిరాహారదీక్షలు
  • ఉప్పాడ సెంటర్‌లో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆద్వర్యంలో మూడో రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు, వంటావార్పు

చిత్తూరు జిల్లా

  • చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద గలా వైఎస్ఆర్ సర్కిల్‌లో జిల్లా మహిళాధ్యక్షరాలు గాయాత్రిదేవి ఆధ్వర్యంలో అన్నదానం

ప్రకాశం జిల్లా

  • మార్కాపురం గడియార స్తంభం సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహం ముందు వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం నాయకుడు ఉడుములకోటిరెడ్డి  ఆధ్వర్యంలోరిలే దీక్షలు
  • ఒంగోలు వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత ఆధ్వర్యంలో వంటావార్పు
  • కోవూరు సమన్వయకర్త  నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంటావార్పు.. లారీ డ్రైవర్లు, సిబ్బందికి భోజనం పెట్టిన నేతలు

నెల్లూరు జిల్లా

  • కావలిలో ఎమ్మెల్యే రామీరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు, డగదర్తి జాతీయ రహదారిపై బైఠాయింపు
  • సూళ్లూరుపేట బస్ స్టాండ్ సెంటర్‌లో రెండో రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు
  • నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో రూరల్ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

పశ్చిమగోదావరి జిల్లా

  • పెదవేగి మండలం గోపన్నపాలెంలో దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగిన రిలే నిరాహారదీక్షలు, వంటావార్పు
  • ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉంగుటూరు సెంటర్‌లో రెండో రోజూ నిరాహార దీక్షలు
  • గోపాలపురంలో నియోజకవర్గ కన్వీనర్ తరి వెంకట్రావు అద్వర్యంలో రిలే నిరాహార దీక్ష, వంటావార్పు

అనంతపురం జిల్లా

  • జిల్లా కలేక్టరేట్ వద్ద వంటావార్పు.. పాల్గొన్న అనంతపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం, పార్టీ నేతలు చవ్వారాజశేఖర్ రెడ్డి, అనంతచంద్రారెడ్డి

గుంటూరు జిల్లా

  • గుంటూరులో బస్తాలు ఎత్తుకుని విద్యార్థుల ఆందోళనలు
  • పొన్నూరులో రిలే నిరాహారదీక్షలో కూర్చున్న నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ

విజయనగరం జిల్లా

  • విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం.. హాజరైన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి, పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ నాయకులు పిల్లా విజయకుమార్, యడ్ల రమణమూర్తి
  • పార్వతీపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగారావు, బొబ్బిలిలో సమన్వయకర్త డాక్టర్ పోలా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు

కర్నూలు జిల్లా 

  • నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో రెండోవ రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు, పటేల్ కూడలిలో వంటావార్పు కార్యక్రమం


నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో రూరల్ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

మరిన్ని వార్తలు