వ్యవస్థలను ఛిన్నాభిన్నం చే స్తున్నది.. చంద్రబాబే

3 Apr, 2016 23:33 IST|Sakshi
వ్యవస్థలను ఛిన్నాభిన్నం చే స్తున్నది.. చంద్రబాబే

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే గెలుపు
యలమంచిలి నియోజకవర్గ విస్తృతస్థాయి
సమావేశంలో నాయకులు బొత్స, ధర్మాన

 
యలమంచిలి: ఎన్నికల ముందు ఒకమాట, గద్దెనెక్కాక మరోమాట చెప్పడం చంద్రబాబు నైజం..  రైతు, మహిళా, పోలీసు వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తున్న ఘనత ఆయనదే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందన్నారు. ఆదివారం యలమంచిలి గుర్రప్ప కల్యాణ మండపంలో జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబు ప్రజలను ఏ విధంగా వంచించారో వివరించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోలేదని, పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 17 నుంచి 67కు పెరిగిందని ధర్మాన  పేర్కొన్నారు. మహిళలు, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చుదిద్దుతానని చెబుతున్న బాబు మాటలు కేవలం ప్రకటనల కే పరిమితమయ్యేలా ఉన్నాయన్నారు. నైతి కంగా పతనమైన వ్యక్తులే వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తుతో గెలిచి, టీడీపీ ప్యాకేజీలకు ఆశపడి పార్టీలు మారుతున్నారని పేర్కొన్నారు. సీఎం దళితులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వారి మనోభావాలు దెబ్బతీశాయన్నారు. బొత్స మాట్లాడుతూ టీడీపీ నేతలు, అధికారు ల అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీసి ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజధాని ప్రాంతంలో కార్పొరేట్ సంస్థల కోసం పచ్చని పంటపొలాలను రైతుల నుంచి లాక్కోవడం అన్యాయమన్నారు.

కోస్తా ప్రాంతంలో మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతునిస్తుందన్నా రు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉ న్నప్పుడు ఉపాధి కల్పించడం కోసం పరిశ్రమ ల ఏర్పాటుకు భూములిచ్చి ప్రోత్సహించామ ని, ఇప్పుడు రియల్‌ఎస్టేట్ వ్యాపారం, ప్యాకేజీల కోసమే భూముల కేటాయింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల తో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర ధర లు మండిపోతున్నాయన్నారు. పేద కుటుం బాల వారు రెండు పూటలా అన్నం తినలేని దుస్థితికి ప్రభుత్వ తీరే కారణమని బొత్స పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ యలమంచిలి ప్రజలు స్థానికేతరుడైన ఎమ్మెల్యేను గెలిపించి ఎంత తప్పు చేశారో ఇప్పుడు తెలుసుకున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు అరాచకపాలన గురించి ప్రజలకు తెలియజేసేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పలివె ల అమృతవల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకూ మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజాను అన్యాయంగా సస్పెండ్ చేశారని, మంత్రి రావెల సుపుత్రుడు మహిళా టీచర్‌ను వేధిస్తే వెనకేసుకురావడం మహిళలపై టీడీపీకి ఉన్న అభిమానం ఏపాటి దో అర్థమవుతోందన్నారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, బొడ్డేడ ప్రసాద్, కొయ్య ప్రసాదరెడ్డి, తైనాల విజయ్‌కుమార్, లాలం రాము తదితరులు ప్రసంగిం చారు. నాయకులు బొద్దపు ఎర్రయ్యదొర, బొద్దపు లక్ష్మి, బెజవాడ నాగేశ్వరరావు, జాగారపు కొండబాబు, రాజాన శేషు, దూది నర్సిం హమూర్తి, రాయి సతీష్ సహా అచ్యుతాపురం, యలమంచిలి, రాంబిల్లి, ముగనపాక మండలాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు