నగరిలో ముగిసిన క్రీడాసంబరం

4 Aug, 2018 09:49 IST|Sakshi
వైఎస్సార్‌ చాంపియన్‌ క్రికెట్‌ టోర్నమెంటు ముగింపు సందర్భంగా బైక్‌ ర్యాలీలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే రోజా

వైఎస్సార్‌ క్రికెట్‌ టోర్నీ విజేత నగరి

రన్నర్స్‌గా పుత్తూరు ఎంజీ ఫైర్స్‌ జట్టు

220 జట్లు.. 2400 మంది క్రీడాకారులు

బహుమతులు అందజేసిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నేతలు

నగరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వైఎస్సార్‌ చాంపియన్‌ క్రికెట్‌ టోర్నమెంటు  శుక్రవారం ముగిసింది. ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో నిర్వహిం చిన ఈ పోటీల్లో 220 టీములు  పాల్గొన్నాయి. ఎనిమిది రోజుల పాటు జరిగిన పోటీల్లో 2400 మంది క్రీడాకారులు సందడి చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన అగ్రనేతలు రోజూ ఇందులో పాల్గొని క్రీడాకారుల్ని ఉత్సాహపరిచారు. 

విజయపురం(నగరి): నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో 8రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైఎస్సార్‌ చాంపియన్‌ క్రికెట్‌ టోర్నీ  శుక్రవారం ముగిసింది. 8 రోజులపాటు 220 జట్లు,2400 మంది క్రీడాకారులతో నగరి ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో సంబరంలా సాగిన  టోర్నమెంట్‌ చివరి రోజు ఫైనల్స్‌లో నగరి డేంజర్‌ ఎలెవన్‌ ఏ జట్టు విజేతగా నిలిచింది. పుత్తూరు ఎంజీ ఫైర్‌ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. విజేతలకు ము ఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యే రోజా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం, జగనన్న ఆశయాల కోసం పోరాడుతూ మహానేత పేరుతో ఇంత పెద్ద   టోర్నమెంట్‌ నిర్వహించిన ఎమ్మెల్యే రోజా అభినందనీయురాలని  కొనియాడారు. టోర్నీ నిర్వహించడం ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన పని అని అన్నారు.

ఎమ్మెల్యే రోజా విజన్‌ ఉన్న నాయకురాలు
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మా ట్లాడుతూ గ్రామీణ యువతకోసం ఎమ్మెల్యే రోజా ఇంత పెద్ద టోర్నీ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి అవకా శాలు వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు. గ్రామీ ణ క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ఇది ఒక వేదికగా నిలిచిందని తెలిపారు.

అందరి ఆశీస్సులతోనే
తనకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ప్రొత్సహిస్తున్న పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నగరి ప్రజలకు తాను రుణపడి ఉంటానన్నారు. మనోస్థైర్యం, ఆత్మవిశ్వాసంతోనే ఇంత పెద్ద టోర్నమెంట్‌ నిర్వహించగలిగానని తెలిపా రు. మొదట్లో 100 జట్లు అనుకుంటే 220 జట్లు వచ్చాయని పేర్కొన్నారు. టోర్నీ నిర్వహణకు  సహాయ, సహకారాలు అందించిన జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న, నగరి డిగ్రీ, జూని యర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు