మహానేత స్మరణలో..

3 Sep, 2018 13:42 IST|Sakshi
శ్రీకాకుళంలో వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న తమ్మినేని సీతారాం తదితరులు

జిల్లా వ్యాప్తంగా వైఎస్‌కు ఘన నివాళులు

శ్రీకాకుళం: వైఎస్‌ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా జరిగాయి. వైఎస్సార్‌ సీపీ నాయకులతో పాటు ప్రజలు కూడా మహా నేతను మనసారా స్మరించుకున్నారు. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో వైఎస్సార్‌ తొమ్మిదో వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతా రాం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రెడ్‌క్రాస్‌ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఆమదాలవలసలో తమ్మినేని సీతారాం అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మున్సిపాలిటీ ఫ్లోర్‌ లీడర్‌ బొడ్డేపల్లి రమేష్‌ కుమార్, పొందూరు ఎంపీపీ ఎస్‌.దివ్య, బూర్జ నాయకులు కె.గోవిందరావు, సరుబుజ్జిలి మండల ఎం పీపీ కేవీజీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేటలోని 3 మండలాల్లోనూ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.

కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి పాల్గొన్నారు. ఎల్‌ఎన్‌ పేట మండలంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.విక్రాం త్‌ నేతృత్వంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలోరక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులుతో పాటు నియోజకవర్గ నాయకులంతా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజాం సీహెచ్‌సీలో రోగులకు రొట్లు, పండ్లు పంపిణీ చేశారు. టెక్కలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం టెక్కలి ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పలాసలో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. వైఎస్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి, కౌన్సిలర్లు బస్టాండు కూడలిలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. కవిటిలో పిరియా సాయిరాజ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నర్తు రామారావులు వేర్వేరుగా వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఎచ్చెర్లలో సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రణస్థలంలో వర్ధంతి కార్యక్రమాలు జరిపారు. 

మరిన్ని వార్తలు