అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న రెవెన్యూ అధికారులు

5 Sep, 2019 20:16 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లాలోని చక్రాయపేట మండలం ఉప్పల వాండ్ల పల్లే గ్రామం ఉప్పల కుంట చెరువులో టీడీపీకి చెందిన వ్యక్తి అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. చెరువులో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనల మేరకే ఇంటిని కూల్చేశామని అధికారులు స్పష్టం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు