వైఎస్సార్ హయాంలో..

19 Apr, 2014 01:48 IST|Sakshi
వైఎస్ హయాంలో నిర్మించిన గురుకుల పాఠశాల

 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖ రరెడ్డి హయాంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో ఉన్న ఏకైక చక్కెర ఫ్యాక్టరీ వేమూరు మండలం జంపనిలో ఉంది. 2004 ముందు ప్రైవేట్ సంస్థ ఆధీనంలో ఉండటంతో వందలాది మంది రైతులు, కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా తయారైంది.


మూతబడిన ఫ్యాక్టరీని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెరిపించి సుమారు 2.5 కోట్లు రూపాయలు మంజూరు చేశారు. వైఎస్సార్ మరణాంతరం ఫ్యాక్టరీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఫ్యాక్టరీ మూతపడింది. జంపనిలో రేపల్లె మెయిన్ డ్రెయిన్‌పై కొత్త వంతెన నిర్మాణానికి వైఎస్ రూ.1.35కోట్లు మంజూరు చేశారు. చుండూరు మండలంలో నూతనంగా నిర్మించిన గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి రూ.9.6 కోట్లు మంజూరు చేశారు.

 వైఎస్సార్ మరణం తర్వాత...
 పేదోడికి సొంతింటి కల ‘కల్ల’గానే మిగిలిపోయింది. అధికార పార్టీ సిఫార్సులున్నవారికే ఇందిరమ్మ ఇళ్లు దక్కుతున్నాయి. తూతూ మంత్రంగా కొంత మంది అర్హులు దక్కించుకున్నా వారుకూడా బిల్లుల కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మహానేత వైఎస్సార్ మరణం తర్వాత పేదలను పట్టించుకునే వారే కరువయ్యారు.

మరిన్ని వార్తలు