అక్టోబర్ 10 నుంచి వైఎస్‌ఆర్ కంటి వెలుగు పథకం

25 Sep, 2019 18:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: 'వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం' అక్టోబరు 10 నుంచి ప్రారంభం కానుంది. పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి వెలుగు పథకం కింద.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు. కాగా వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకాన్ని మొత్తం ఐదు దశల్లో అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి రెండు దశల్లో స్కూల్‌ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు దశల్లో కమ్యూనిటిబేస్‌ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పథకం పర్యవేక్షణకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటయిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు కంటి వెలుగు పరీక్షల నిర్వహణ, వసతుల కల్పనకు సంబంధించిన ఏర్పాట్లను చూస్తోంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు