‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు

28 Jan, 2020 21:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారి చేసింది. కాపు మహిళలకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించనుంది. ఇక నుంచి రాష్ట్రంలోని కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళలకు ఈ ఆర్థికసాయం అందనుంది. 45 ఏళ్లు పైబడిన 60 ఏళ్లలోపు కాపు మహిళల జీవనోపాధి కింద ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ వర్తిస్తుంది.
( వైఎస్సార్‌ కాపు నేస్తం) 

మరిన్ని వార్తలు