‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ దరఖాస్తు గడువు పొడిగింపు

23 Nov, 2019 04:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: అర్హులైన ఏ ఒక్కరూ లబ్ధి కోల్పోకుండా ఉండేందుకు ఇతర పథకాలకు గడువు పెంచినట్లే ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ పథకం దరఖాస్తు గడువునూ రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఇప్పటివరకు పేర్లను నమోదు చేసుకోని వారు గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్లను సంప్రదించి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. శుక్రవారం ఈ పథకంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు.

గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ఉంచామని, అర్హతలు, దరఖాస్తు విధానాన్ని వలంటీర్ల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం కొత్త లబ్ధిదారులకు నగదు అందచేస్తామని చెప్పారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా కొమానపల్లిలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ప్రారంభోత్సవం సందర్భంగా దరఖాస్తు గడువు పొడిగింపు గురించి ప్రస్తావించలేదని, ఈ నేపథ్యంలో మత్స్యకారులందరికీ తెలిసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు