వైఎస్‌ జగన్‌తోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యం

10 Mar, 2019 13:07 IST|Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలోని వినుకొండలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. వైఎస్‌ఆర్ సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో,  మైనార్టీ సెల్‌ జాతీయ అధ్యక్షులు రెహమాన్, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్‌ బాషా,  ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ నేతలు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగించారు.  వైఎస్‌ జగన్‌తోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యమని నేతలు అన్నారు. మైనార్టీలందరూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

కార్యకర్తల ఆత్మీయ సమావేశం
పశ్చిమ గోదావరి :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన ఓంట్లో, ఇంట్లో ఉంటారని, అందుకే తన మనవడికి వైఎస్సార్‌ పేరు పెట్టుకున్నానని  వైఎస్సార్‌సీపీ నేత రఘురామ కృష్టంరాజు తెలిపారు. ఆదివారం కాళ్ల మండలంలో రఘురామ కృష్టంరాజు ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు గ్రంధి శ్రీనివాస్‌ మోసేన్‌రాజుతో పాటు పలువురు నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘురామ కృష్టంరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుకి ఓటమి అర్థమయ్యే.. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఫారం- 7 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్కరు గమనించి, తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని రఘురామ సూచించారు. ప్రతి ఒక్కరు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు రఘురామ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు