ఇది సంక్షేమ రాజ్యం

22 Dec, 2019 11:28 IST|Sakshi
వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి 4,279 మందికి రూ.10.24 కోట్ల చెక్కును విడుదల చేస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని తదితరులు

 ప్రజా సంక్షేమం కోసం  అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి  

ఇచ్చిన మాటకు కట్టుబడే సీఎం మనకు ఉండటం  గర్వకారణం  

నేత కార్మికుల మగ్గాలు ఆగకూడదనే వైఎస్సార్‌ నేతన్న నేస్తం  

వైఎస్సార్‌ నేతన్న నేస్తం ప్రారంభోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి

పెడన: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెడనలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ చేనేత కారి్మకుల సంక్షేమం, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏటా ప్రభుత్వం లబి్ధదారుల ఖాతాల్లో రూ.24 వేల చొప్పున జమ స్తుందని తెలిపారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత వరకు నేత కారి్మకులకు సాయం చేసిన దాఖలాలు లేవన్నారు. జిల్లాలో 4,270 మందికి చేనేతలకు రూ.10.24 కోట్లు అందనున్నట్లు స్పష్టం చేశారు.

ముద్ర యోజన రుణం కింద ఏడు శాతం వడ్డీ రాయితీతో రూ.లక్ష మాత్రమే ఇచ్చేవారని, ఇదే రాయితీతో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అందించేలా ముఖ్యమంత్రి నేత కార్మికుల కోసం అవకాశం కల్పించారన్నారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నవరత్నాలలోని పథకాలను తూచా తప్పకుండా అమలుచేసి తీరుతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే 80 శాతం హామీలు అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నేను ఉన్నాను.. నేను విన్నాను.. నేను చేస్తాను అని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదికాలాల పాటు సీఎంగా ఉండేలా మద్దతు ఇద్దామన్నారు.

నేత  కార్మికులకు ఆత్మగౌరవం అధికం : మంత్రి పేర్ని నాని 
నేత కార్మికులు ఆత్మగౌరవంతోనే జీవిస్తుంటారని, వారికి పనులు లేకపోయినా పస్తులుంటారే తప్ప ఏనాడు కూడా చేయి చాచిన దాఖలాలు లేవని రాష్ట్ర రవాణా, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. నేత కార్మికులను ఆదుకోవాలనే కృతనిశ్చయంతో సబ్సిడీ  రుణాలు, నూలుపై రాయితీలు వంటివి ఏమి కాకుండా నేరుగా నేత కార్మికుని బ్యాంకు ఖాతాలో రూ.24 వేలు జమ అయ్యేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు.

చేనేతలను ఆదుకోవాలనే కృతనిశ్చయంతో : మంత్రి కొడాలి నాని 
చేతి వృత్తిదారుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో అధికంగా నేత కార్మికులున్నారని, వారిని ఆదుకోవాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. పలు పథకాలు డిసెంబరు 21న ప్రారంభించుకుందామని చెప్పినా తిరస్కరించిన  ముఖ్యమంత్రి, నేత కార్మికులు అధికంగా ఉండే ధర్మవరం నియోజకవర్గంలో నేతన్నల నడుమ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి, వైఎస్సార్‌ నేతన్న నేస్తం ప్రారంభించేందుకు వెళ్లారని తెలిపారు. చేనేత కార్మికుల పట్ల సీఎంకు ఉన్న అంకితభావం ఎటువంటిదో మీరే ఆలోచించుకోవాలన్నారు.

పెడన నియోజకవర్గంలో అధికంగా లబ్ధిదారులు : ఎమ్మెల్యే జోగి రమేష్‌  
జిల్లాలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకానికి అర్హులు 4,270 మంది ఉంటే అందులో పెడన నియోజకవర్గంలో 3,219 మంది ఉన్నారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ తెలిపారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ సొంత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి రూ.24 వేలు జమ అవుతాయని చెప్పారు. ఆ డబ్బుతో తమ మగ్గాలను ఆధునికీకరించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.  డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఉప్పాల రాంప్రసాద్, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బండారు ఆనందప్రసాద్, మాజీ కౌన్సిలర్‌ కటకం ప్రసాద్‌ తదితరులు ప్రసంగించారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు భళ్ల గంగాధరరావు, కేడీసీసీబీ డైరెక్టర్‌ నల్లమోతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, మాజీ కౌన్సిలర్లు గరికిముక్కు చంద్రబాబు, మెట్ల గోపిప్రసాద్, బంటుమిల్లి, పెడన, కృత్తివెన్ను, గూడూరు మండలాల పార్టీ అధ్యక్షులు మలిశెట్టి రాజబాబు, దావు బైరవలింగం, కొల్లాటి గంగాధరరావు, తలుపుల కృష్ణ, జెడ్పీ  సీఈవో సూర్యప్రకాశరావు, చేనేత జౌళి శాఖ ఏడీ ఎస్‌.రఘునంద, ఆర్డీఓ  ఖాజావలి, తహసీల్దారు పి.మధుసూదనరావు, కమిషనర్‌ అబ్దుల్‌రïÙద్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు