వైఎస్సార్‌ విగ్రహ స్థాపన కోసం ధర్నా..!

1 Jun, 2019 12:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలోని కంట్రోల్‌ రూమ్‌ జంక్షన్‌​ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని వైఎస్సార్‌ విగ్రహ పునఃప్రతిష్ట కమిటీ ఆందోళన చేపట్టింది. కంట్రోల్‌ రూమ్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ పేరుతో వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగించారని కమిటీ సభ్యులు ఆరోపించారు. మహానేత విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని కోరుతూ శనివారం ఫైర్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ధర్నా నిర్వహించి.. అక్కడున్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విగ్రహాన్ని తొలగించారు కానీ ప్రజల మనసుల్లోనుంచి వైఎస్సార్‌ను తొలగించలేకపోయారని అన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వైఎస్‌ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని కమిటీ సభ్యులు విన్నవించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
వైఎస్సార్‌ విగ్రహ పునఃప్రతిష్ట కోసం ధర్నా..

మరిన్ని వార్తలు