‘ప్రాణం పోయినా సరే.. రైల్వేజోన్‌కు పోరాటం’

30 Mar, 2017 16:42 IST|Sakshi
‘ప్రాణం పోయినా సరే.. రైల్వేజోన్‌కు పోరాటం’

అనకాపల్లి : తన ప్రాణం పోయినా సరే విశాఖ రైల్వేజోన్‌ సాధించేవరకూ పోరాటం చేస్తానని వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ సాధన కోసం ఆయన ఇవాళ్టి నుంచి 11 రోజులు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌ మాట్లాడుతూ రైల్వేజోన్‌ కోసం విశాఖ ప్రాంత ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారన్నారు. విశాఖ ప్రజలు ఓడారని, బీజేపీ ఎంపీ హరిబాబు పదేపదే చెబుతున్నారని, అయితే ఇక్కడ గెలిచిన నేతలు ఢిల్లీలో మాత్రం పోరాటం చేయలేకపోతున్నారన్నారు.  కాగా అమర్‌నాథ్‌ ఆత్మగౌరవ యాత్ర అనకాపల్లి నుంచి మొదలై చిట్టివలస వరకూ సాగుతుంది.

రైల్వేజోన్‌ రావాల్సిందే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని వైఎస్‌ఆర్‌ సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నాయని, ఇప్పుడు రైల్వే జోన్‌ రాకుండా చేస్తున్నాయన్నారు. రైల్వేజోన్‌ కోసం తీవ్రమైన పోరారం చేయాల్సి ఉందని, రాష్ట్రంలో లోటు బడ్జెట్‌లో ఉందని ప్రభుత్వం పదేపదే చెబుతోందని, మరో లక్ష​ కోట్ల అప్పుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. అప్పులు తెచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని ధర్మాన అన్నారు.

తెలంగాణ కంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రైల్వేజోన్‌ రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రతి ఒక్కరు  కృషి చేయాలని, అందరూ పాదయాత్రలో పాల్గొనాలని సూచించారు. విశాఖకు రైల్వేజోన్‌ రావాలంటే గుడివాడ అమర్నాథ్‌ పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపాలని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ... వెనుకబాటుతనం ఇక్కడే ఉందని, విశాఖకు రైల్వే జోన్‌ రావాలని అన్నారు. రైల్వే జోన్‌ వస్తే కొన్నివేల ఉద్యోగాలు వస్తాయని, అమర్‌నాథ్‌ ఆత్మగౌరవ యాత్రకు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక వర్షాలే వర్షాలు

సీపీఎస్‌ రద్దుకు సర్కారు కసరత్తు

శ్రీకాకుళం నుంచి శ్రీకారం

అన్నదాత పై అబీమానం

పోలవరం అక్రమాలపై ‘రివర్స్‌’ పంచ్‌

మా వైఖరి సరైనదే

వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ఏపీ అసెంబ్లీ చీఫ్‌ విప్‌, విప్‌లకు క్యాబినేట్‌ హోదా

బిగ్‌షాక్‌; బీజేపీలోకి టీడీపీ, జనసేన నేతలు

26న ఎమ్మెల్సీ ఎన్నికలు‌..!

ఈనాటి ముఖ్యాంశాలు

పయ్యావులకి ఆపదవి ఇవ్వాల్సింది: వైఎస్సార్‌సీపీ నేత

గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం

పోలవరంలో వరద తగ్గుముఖం

అల్లర్లకు పాల్పడితే బైండోవర్‌ కేసులు

కోటిపల్లి వద్ద పోటెత్తుతున్న వరద

‘బాబు ప్రైవేట్‌ విద్యకు బ్రాండ్‌ అబాసిడర్’

విద్యాభివృద్ధి దేశ స్థితి గతులనే మార్చేస్తుంది: గవర్నర్‌

ఈశాన్య బంగాళఖాతంలో అల్పపీడనం..

అప్పుడే ఏడుపు లంకించుకున్నాడు..!

మహిళా ఉద్యోగినిపై దుర్భాషలాడిన ఏఎస్‌ఓ అధికారి

కంపెనీ స్టిక్కర్‌ వేశారు.. అమ్మేశారు 

ఏమిటీ దుర్భరస్థితి ?

ఉసురు తీసిన ‘హైటెన్షన్‌’

జీవితాన్ని మార్చేసిన కరివేపాకు

గీత దాటితే వేటే !

ఆకస్మిక తనిఖీలు 

వెన్నులో వణుకు పుడుతుందా ఉమా?

అమ్మో ! ఎంత పెద్ద కొండచిలువో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌

ఉప్పెనలో ఉన్నాడు

గన్‌దరగోళం