మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తా

6 Jun, 2019 13:39 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ చీఫ్‌విప్‌గా నియమితులైన మార్గాని భరత్‌రామ్‌ను అభినందిస్తున్న క్రెడాయి ప్రతినిధులు

రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్‌ సీపీ పార్లమెంటు చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌ రామ్‌

చీఫ్‌విప్‌ నియామకంపై అభినందనల వెల్లువ

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తానని, అభివృద్దే తన అజెండా అని పార్లమెంటు సభ్యుడు, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌రామ్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ చీఫ్‌విప్‌గా మార్గాని భరత్‌రామ్‌ నియమితులు కావడంతో ఆయనను అభినందించేందుకు బుధవారం ఉభయగోదావరి జిల్లాల నుంచి  పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆయనకు పూల బొకేలు అందించి, శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ ‘నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నా’నన్నారు. 

రాజమహేంద్రవరం పార్లమెంటు సీటును బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంతోపాటు, జగన్‌మెహన్‌ రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో బీసీలంతా వైఎస్సార్‌సీపీకి వెన్నుదన్నుగా నిలిచి ఓట్లు వేసి గెలిపించారన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది సీనియర్లుండగా అదీ బీసీలకు పెద్దపీట వేయాలని, యువతకు ప్రాధాన్యతనీయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చీఫ్‌విప్‌గా అవకాశం కల్పించి ఉండవచ్చన్నారు. నాపైన చాలా పెద్ద బాధ్యత  పెట్టారని,  ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పార్లమెంటులో తెలుగువాణిని వినిపిస్తానని మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. క్రెడాయి ప్రతినిధులు బుడ్డిగ శ్రీనివాస్, సూరవరపు శ్రీనివాస్, భీమశంకరం, మన్యం ఫణికుమార్, ఆకార్‌ నరసింహారావు, మిరపల శ్యామలరావు, చల్లా మురళి తదితరులు మార్గాని భరత్‌రామ్‌కు పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు