ఎన్నికల్లో ఓడిపోయామన్న అక‍్కసుతోనే..

10 Oct, 2019 16:14 IST|Sakshi

సాక్షి, కృష్ణా : గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ సచివాలయంపై ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటంపై గుర్తు తెలియని వ్యక్తులు బురదజల్లడం వివాదాస్పదంగా మారింది. గురువారం తెల్లవారు జామున ఈ దృశ్యాన్ని గుర్తించిన గ్రామ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. సీఎం జగన్‌ చిత్రపటంపై ఇలాంటి దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి చెందామన్న అక్కసుతో, వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు చూసి ఓర్వలేని టీడీపీ నాయకులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ ఘటనపై  గ్రామ సెక్రటరీతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్వారంటైన్‌ పూర్తైనవారిని తరలించండి

కరోనా నుంచి రబీ గట్టెక్కినట్టే..

‘రాజకీయాలకు సమయం కాదన్న కనీస స్పృహ లేకుండా..’

లాక్‌డౌన్‌లోనూ మద్యం అమ్మకాలా..

విస్తరిస్తున్న కరోనా!

సినిమా

కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు